ఎస్సారెస్పీ అధికారులు ప్రస్తుతం నిద్రమత్తులో జోగుతున్నారు. ఎవరు చెప్పిన ఎంత చెప్పినా వారు మాత్రం ఆ నిద్ర మత్తు నుంచి బయటకు వచ్చేలా లేరు. ఎస్సారెస్పీకి సంబందించిన ఏ విషయం లోనైన వీరిది నిజంగా నత్త నడకే వీరి పని తీరు, సమస్యలపై స్పందించే తీరు చూస్తే నత్తలు సైతం ముక్కున వేలేసుకుంటాయి అంటే ఎంతమాత్రం అతిశేయోక్తి కాదు. ప్రయివేటు వ్యక్తుల మూలంగా ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం ఐయిన, కుంగి పోయిన వీరు మాత్రం కార్యాలయాల్లో కూర్చొని టైం పాస్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా విమర్శలు వస్తున్న వీరిలో ఎంత మాత్రం చలనం కలగడం లేదు.
సమస్య ఏంటి….?
దామెర మండలం ల్యాదేళ్ల గ్రామ శివారులో మాధవ, సిరి స్టోన్ క్రషర్ లు ఏర్పాటు చేశారు. ఈ స్టోన్ క్రషర్లకు వాహనాలు వెళ్ళడానికి, రావడానికి అసలు దారే లేదు. భారివాహనాలు వస్తూ పోతు ఉంటాయి. ఈ క్రషర్లకు ఎలాంటి దారి లేసు కనుక పక్కనే ఉన్న ఎసారెస్పీ కాలువ రహదారిపై కన్ను పడింది ఇంకేముంది కాలువ రహదారి పైనుంచే ఈ క్రషర్లకు చెందిన భారీ వాహనాలు వెళ్తుంటాయి. దీని మూలంగా ఎస్సారెస్పీ కెనాల్ కు బారి ముప్పు పొంచి ఉంది. అయిన ఇదేం అధికారులకు అవసరం లేదు. క్రషర్లకు చెందిన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్న కళ్ళుమూసుకుని కార్యాలయంలోనే కూర్చుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటన చేయకుండా అసలు సమస్య ఎక్కడుందో పరిశీలన చేయకుండా నిద్ర పోతున్నట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారు.
కెనాల్ రహదారి లిజుకిచ్చార….?
లాదెళ్ళ గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాలువ రహదారిని నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ యజమానులు యదేచ్చగా వాడడాన్ని చూస్తుంటే కాలువ రహదారి నీ అధికారులే వారికి లీజుకు ఇచ్చారనే అనుమానం కలుగుతుంది. భారీ వాహనాలు కెనాల్ రహదారి పైనుంచే వెళ్తున్న అధికారులు మాత్రం తమకేం అవసరం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వాహనాల మూలంగా కెనాల్ కు ప్రమాదం అని తెలిసిన అధికారులు గమ్మున ఉంటున్నారు అంటే లీజ్ కు కెనాల్ రహదారి ఇచ్చారోమొనని గ్రామస్తులు సైతం అంటున్నారు. ఈ విషయం ఎస్సారెస్పీ అధికారులు నిరువిప్పితే తప్ప తెలియదు.
పాత నోటీసులు వెతుకుతున్న
క్రషర్ యజమానులకు నోటీసులు ఇవ్వడానికి పాత నోటీసులు వెతికే పనిలో ఉన్నట్లు ఎస్సారెస్పీ డి ఇ వెంకటరమణ న్యూస్10 కు తెలిపారు. గతంలో కూడా ఈ క్రషర్లకు నోటీసులు అందించారని మళ్ళీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని పొంతనలేని సమాధానం చెప్పారు. కనీసం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి క్రషర్లను పరీశిలించకుండా క్రషర్ యజమానులకు తాను వ్యక్తిగతంగా ఫోన్ చేసి కెనాల్ రహదారిని వాడొద్దని చెప్పినట్లు డి ఇ తెలిపారు.
అధికారులు, యాజమాన్యం మిలాఖత్..?
క్రషర్ యజమానులు తమ రవాణా కోసం ఎస్సారెస్పీ కెనాల్ ను వాడే విషయంలో ఎస్సారెస్పీ అధికారులతో మిలాఖత్ ఐయారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. గ్రామానికి చెందిన రైతులు ఎస్సారెస్పీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్రషర్ యజమానుల నుంచి నెల వారీగా వచ్చే మొత్తానికి ఆశ పడి అధికారులు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వాహనాల మూలంగా కెనాల్ కు ప్రమాదం పొంచి ఉన్న అధికారులు చర్యలు తీసుకోకుండా ఉంటున్నారంటే ఈ ఆరోపణలు నిజమేనని అనిపిస్తుందని పలువురు అంటున్నారు. ఇకనైనా అధికారులు ఈ రెండు క్రషర్లు కెనాల్. రహదారిని వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.