గ్రేటర్ వరంగల్ లో వెలుస్తున్న అక్రమనిర్మాణాపై ప్రశ్నిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎక్కడలేని కోపం వస్తుంది… అక్రమనిర్మాణాల గూర్చి అడుగుతారా… వార్తలు వెలువరిస్తార… అన్నట్లు అక్రమ నిర్మాణాలపై వివరణ అడిగితే చాలు అధికారులు చిర్రుబుర్రులాడుతున్నారు ఏ ప్రశ్న అడిగిన నోటీసులు ఇచ్చాం అనే ఏక వాక్య సమాధానం తో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు… ఇక గ్రేటర్ వరంగల్ అంతటికి టౌన్ ప్లానింగ్ లో సిపి గా ఉన్న అధికారి మాత్రం ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేసి సమాధానం చెప్పే స్థితిలో లేరు… ఫోన్ చేయగా చేయగా లిఫ్ట్ చేస్తే రాస్తున్నారు గా రాసుకోండి అంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగినట్లు మాట్లాడుతున్నారు. కార్యాలయానికి నేరుగా వెళ్లి మాట్లాడుదాం అంటే కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండడం లేదు.ఇంత బిజీగా ఉన్న ఆ అధికారికి మాత్రం అక్రమ నిర్మాణాలపై వార్త వెలువరించే వరకు అది అక్రమ నిర్మాణం అనే సంగతి కూడా తెలియకపోవడం, తెలియనట్లు అవునా అని ఆశ్చర్య పోవడం విడ్డురంగా తోస్తుంది.
ఎందుకీ అసహనం…?
అక్రమనిర్మాణాలపై ప్రశ్నిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ అసహనం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు.అక్రమ నిర్మాణాలపై వార్త కథనాలు వెలువడుతుంటే వారి లొసుగులు ఎక్కడ బయటపడుతాయోనని భయపడుతున్నార…తెలియదు. న్యూస్10 లో వరుసగా వెలువడుతున్న కథనాలవల్ల టౌన్ ప్లానింగ్ అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది… అన్ని తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరించే టౌన్ ప్లానింగ్ అదికారులు అక్రమనిర్మాణాలపై ప్రశ్నిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు…సమాధానం చెప్పకుండా ,వివరణ ఇవ్వకుండా దాటవేస్తున్నారు
నోటీసు ఇచ్చినం చర్యలు ఎప్పుడుంటాయో తెల్వదు… భిక్షపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్
నగరంలోని అదాలత్ గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై న్యూస్-10 లో చూసినం వెంటనే ఆ భవనం వద్దకు వెళ్లి యజమానికి నోటీసులు ఇచ్చినం కానీ ఏ రోజు ఇచ్చామో, ఎన్ని గంటల గడువు పెట్టామో నాకు గుర్తులేదు. అక్రమ నిర్మాణాలపై నన్నేమి అడగకండి అంతా మా పెద్దసారు సిటీ ప్లానర్ కే తెలుసు.ఆ బిల్డింగ్ పై చర్యలు ఎప్పుడుంటాయో నేనేం చెప్పలేను… ఇది అక్రమనిర్మాణం పై వివరణ కోసం కాజీపేట సర్కిల్ కార్యాలయానికి వెళ్లిన న్యూస్10 ప్రతినిదికి అసిస్టెంట్ సిటీ ప్లానర్ భిక్షపతి ఇచ్చిన సమాధానం… వివరణ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిధిని చూసిన ఆయన చిర్రుబుర్రు లాడారు… కనీస మర్యాద లేకుండా ఏక వాక్య సమాధానాలు ఇస్తూ వివరాలకోసం అడుగుతుండగానే కుర్చీపై నుంచి లేసి నాకు ఎం తెల్వదు పెద్దసారును అడుగు అంటూ వెళ్లిపోయారు… అక్రమనిర్మాణాలపై ఇంతగా ప్రేమ ఒలకబోస్తూ ఎలాంటి భయం లేకుండా చూస్తాం చేస్తాం అంటూ సమాధానం ఇస్తూ ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వీరి వెనకాల ఉన్నది ఎవరు…. అక్రమ నిర్మాణం అని తెలిసినా చర్యలు తీసుకోకుండా వీరిని అడ్డుకుంటున్న శక్తులు ఏంటి… తెలియాల్సివుంది.
నగరంలో జరుగుతున్న నిర్మాణాలల్లో అధికారి నుంచి పదవుల్లో కొనసాగుతున్న రాజకీయ నాయకుల వరకు వాటాల చరిత్ర గుట్టు త్వరలో రట్టు కానుంది… నిర్మాణం జరిగితే అది అక్రమం అయితే ఓ రేటు సక్రమం ఐయిన మరో రేటు ఎవరు ముక్కుపిండి వసూల్ చేస్తున్నారో గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ ఎలా పక్కదారి పడుతోందో… ఆ బండారాన్ని న్యూస్10 త్వరలో బయటపెడుతుంది….