వరంగల్ రవాణా శాఖలో అధికారులు,సిబ్బంది ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఒకే నంబర్ రెండు వాహనాలతో తేటతెల్లమైంది…. కొంతమంది వాహనదారులతో కుమ్మకై ఒకే నంబర్ ను ఇంకో వాహనానికి కేటాయించి తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ పరిధిలో రిజిస్ట్రేషన్ ఐయిన వాహనం సిసి ని నిజామాబాద్ కు బదిలీ చేసి అసలు వాహనదారునికి తెలియకుండా వేరే వాహనానికి నంబర్ కేటాయించిన అధికారులు వారి పనికిమాలిన పని బయటపడిన కనీసం చీమ కుట్టినట్లైన లేకుండా ప్రవర్తిస్తున్నారు… రెండు సంవత్సరాలుగా అసలు వాహానదారుడు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తప్పు అధికారులు చేసి… ఇలా ఎలా జరిగిందని అడిగిన వాహనదారున్ని బెదిరించడం వారికే చెల్లింది.
పైల్ మాయం చేసింది ఎవరు…?
ఒక వాహనం వివరాలు దానికి సంబంధించిన ఒరిజినల్ కాగితాల సాయంతో ఒక నంబర్ ను ఇంకో వాహనానికి కేటాయించడం రవాణా శాఖ కార్యాలయ సిబ్బందికే సాధ్యం అవుతుంది.ఎందుకంటే అన్ని వివరాలు వారి ఆధీనంలో ఉంటాయి కనుక ఒక వాహనం నంబర్ ను ఇంకో వాహనానికి కేటాయించే విషయంలో సిబ్బంది మూలంగానే ఇలా జరిగినట్లు తెలిసింది… వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ ఈ పని చేసినట్లు తెలిసింది… ఇలా కేటాయించడం వివరాలను పరిశీలించడం ఈ సీనియర్ అసిస్టెంట్ పరిదిలోనిదే…. ఈ ఉద్యోగి తన చేతివాటంతో ఒకే నంబర్ ను రెండు వాహనాలకు కేటాయించే పని చేసినట్లు విశ్వసనీయ సమాచారం… విషయం బయటపడకుండా కార్యాలయంలోని పైల్ మాయం చేసి అసలు వాహానదారుడు మీడియాకు చెప్పడంతో వేరే పైల్ సిద్ధం చేసేందుకు ఆ అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది… రెండు సంవత్సరాలుగా అసలు వాహానదారుడు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అతడికి ఎలాంటి సమాధానం చెప్పకుండా రవాణాశాఖ అధికారి తప్పు చేసిన అధికారులను వెనకేసుకొస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన వాహనం నంబర్ వేరే వాహనానికి ఎలా బదిలీ ఐయిందో అధికారులను విచారిస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నాడు.