ఆ ఎస్సై అంతే…..!

ఆ ఎస్సై అంతేనట ఆయన తీరేవేరట… సామాన్యులంటే అసలే గిట్టదట… సమస్య ఉండి సామాన్యులేవరైన పోలీస్ స్టేషన్ వెలితే చుక్కలు చూడాల్సినదేనని విమర్శలు వినపడుతున్నాయి. అంతేకాదు మండలంలో ఎక్కడ ఎం జరిగిన భాదితులకు న్యాయం జరగడం అనేది కలగానే మిగులుతుందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధితుల బంధువులు న్యాయం చేయమని అడిగిన చాలు ఈ ఎస్సై సారు బండ బూతులు తిడతాడట.. ఎం అన్యాయం చేసిన వ్యక్తులు రాజకీయ పలుకుబడి కలిగి ఉంటే చాలు నష్ట పోయిన వారి బంధువులపై ఆ ఎస్సై బూతులతో విరుచుకుపడతాడట.. తప్ప ఎప్పుడు మంచిగా మాట్లాడిన సందర్భాలు లెవట… తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పుకునే ఈ ఎస్సై రాజకీయ అండతోనే ఇలా సామాన్యులపై విరుచుకుపదుతున్నాడని మండల కేంద్రంలో ఆరోపణలు వినవస్తున్నాయి. రైతును ఇష్టారీతిన తిట్టి అకారణంగా చితకబాదిన ఎస్సై బాధితులతో మాట్లాడి వారిని బుజ్జగించేందుకు ప్రస్తుతం రాజకీయ నాయకులనే నమ్ముకున్నట్లు తెలిసింది.ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులను మద్యవర్తులుగా బాధితుల ఇంటికి పంపినట్లు తెలిసింది. రైతును చితకబాది మంచానికే పరిమితం అయ్యేలా చేసిన రేగొండ ఎస్సై ఇప్పుడు రాజీ మంత్రం జపిస్తున్నాడట. మనం మనం ఒక్కటీ… మనమే సమస్యను పరిష్కరించుకుందాం.. ఎందుకు ఇంత సినిమా అంటూ చిలక పలుకులు పలుకుతున్నాడట.పోలీస్ స్టేషన్లో కనీసం ప్రెండ్లీ పోలీసింగ్ మచ్చుకైనా చూపని ఈ ఎస్సై ఇప్పుడు మాత్రం నేనంటే ప్రెండ్లి అంటున్నాడట.

ఆ ఎస్సై అంతే.....!- news10.app

రేగొండ ఎస్సై పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

అధికార బలంతో అమాయక రైతును చితకబాది మంచానికే పరిమితం చేసిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పై బాధిత రైతు శ్రీనివాస్ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రేగొండ మండల కేంద్రంలో ఈ నెల 22 న రైతును స్టేషన్లో బంధించి లాఠీ లు విరిగేలా కొట్టి అధికార జులుం ప్రదర్శించిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పై న్యూస్ 10 అందించిన ప్రత్యేక కథనం తెలిసిందే.ఇదిలా ఉంటె ఎస్సై పై బాధితుడు శ్రీనివాస్ జిల్లా ఎస్పీకి ,స్థానిక ఎస్ ఎచ్ ఓ కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేసాడు.రైతు ఫిర్యాదుతో చేసిన తప్పు తెలుసుకున్న ఎస్సై పునరాలోచనలో పడి స్థానిక నాయకులు, సన్నిహితులతో పైరవీలు కూడా మొదలుపెట్టాడట… బాధిత కుటుంబాన్ని మనం మనం చూసుకుందాం… దీన్ని సినిమా చేయాల్సిన అవసరం ఏముంది అంటూ బేరసారాలు దిగే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

అధికారులు స్పందించాలి…

రైతును అకారణంగా చితకబాదిన రేగొండ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. కనీస విచక్షణ లేకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే బాధితుడి బంధువులు పోలీస్ ఉన్నతాదికారులకు ఇప్పటికే పిర్యాదు చేయగా వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here