ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని స్వీయ నియంత్రణతోనే అదుపుచేయవచ్చునని బిజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. శనివారం ఆయన హన్మకొండ రాంనగర్‌లో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు 25కేజీల బియ్యం,2 అయిల్‌ప్యాకెట్లను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వైద్య, మున్సిపల్, పోలీసుల శాఖలతో పాటు మీడియా సైతం విశేష కృషి చేస్తోందని దేశ ప్రధానీ నరేంద్రమోది కితాబు ఇచ్చారని అన్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు తన వంతుగా చిన్న సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా సమాచారాన్ని ప్రజలకు నిత్యం అందజేస్తూ అప్రమత్తం చేయడంలో మీడియా పాత్ర గణనీయమైందన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ధరించి పోలీసులకు, జిల్లా పాలనాయంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ చాడా స్వాతిరెడ్డి, బిజెపీ నాయకులు బైరీ శ్రవణ్‌కుమార్, తోట సురేష్, శనిగరం విజయకుమార్, హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్, కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్. బుచ్చిరెడ్డి, కొల్ల కృష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్ కుమార్, వలిశెట్టి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.