గులాబీలో సీజనల్ నేతలు
గులాబీ పార్టీలో ఉన్న కొంతమంది సీజనల్ నేతలు,వలస నేతల మూలంగా అధిష్టానానికి కొంతమేర తల నొప్పి తయారయిందట వలస నేతలను, సీజనల్ నేతలను అప్పుడున్న రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ప్రస్తుతం వీరు… ఏకు లా వచ్చి మేకులా తయారు ఐయినట్లు పార్టీలోనే విమర్శలు వినపడుతున్నాయి… మొన్నటికి మొన్న ఓ ఇద్దరు సీనియర్ వలస నేతలు చేసిన రాజకీయ కుట్ర మూలంగా గులాబీ బాస్ వీరిపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తుంది.
సాధారణ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్న కొంతమంది వలస, సీజనల్ నేతలు చేస్తున్న హడావుడి, ఇతర పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉంటూ అంటకాగుతున్న పద్దతి చూస్తుంటే గులాబీ పార్టీలో ఉన్న వీరిపై అధిష్టానానికి అపనమ్మకమే కలుగుతుందట… ఇంటి గుట్టు మొత్తం తెలుసుకొని వేరే పార్టీలకు చేరవేసి అధిష్టానంపై విమర్శలు చేసి… రచ్చ సృష్టించి వేరే పార్టీలోకి జంప్ చేసేందుకు కొంతమంది సీనియర్ వలస గులాబీ నాయకులు తమ శక్తి మేర పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది… ఇప్పటివరకు అధిష్టానానికి విధేయులుగా… నమ్మినబంటులుగానే ఉన్నామని కలరింగ్ ఇస్తున్న వీరు సమయాన్ని బట్టి వారి అసలు స్వరూపాన్ని బయటపెడతారనే ప్రచారం సైతం జరుగుతుంది.. అయిన వలస వచ్చిన నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం, పదవులకోసం వస్తారు తప్ప… పార్టీలో ఎందుకు వారు స్థిరంగా ఉంటారని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి… వలస నేతలు పార్టీ లోకి రాగానే వారిని పదవులతో అందలం ఎక్కిస్తే వారు పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు తప్ప… లాభం మాత్రం చేయడం లేదని గులాబీ సీనియర్ కార్యకర్తలు అంటున్నారు.
పార్టీ రాజకీయ జీవం పోసి ఉన్నతమైన పదవులు కట్టబెడితే వారే కోవర్థులు గా మారి పుట్టి ముంచాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. సీ ఎం ఓ ఉద్యోగితో కలిసి కుట్ర చేసిన ఆ ఇద్దరు వలస నేతలపై కేసీఆర్ గుర్రుగా ఉన్న సమయం చూసి వారిపై వేటు వేసి పార్టీలో ఇలాంటి కోవర్టు పనులు చెల్లవని చెప్పాలని గులాబీ పార్టీ లోని మెజార్టీ సీనియర్ శ్రేణులు కోరుకుంటున్నారట. ఇప్పటికే తన పిఆర్వో ను బయటకు సాగనంపిన కేసీఆర్ ఇంకొంతమంది కోవర్టులను గుర్తించే పనిలో పడ్డారని ఆపరేషన్ కోవర్ట్ ను వేగవంతం చేశారని త్వరలోనే మరికొంతమందిని సాగనంపక తప్పదని తెలంగాణ భవన్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నా గులాబీ పార్టీ సీజనల్ నాయకులు, వలస నేతలపై ఆధారపడకుండా ఇకనైనా మెజార్టీ ఉద్యమ నాయకులకు, ఉద్యమ కాలం నుంచి కొనసాగుతున్న నేతలకు ప్రాధాన్యం కల్పించి పార్టీని మరింత బలోపేతం చేస్తే ఇలాంటి ఇంటి దొంగల పని పట్టవచ్చని గులాబీ సీనియర్లు అంటున్నారు… ఎంతైనా వలస వలసే… కనుక అసలు నేతలను కాపాడుకునే ప్రయత్నం గులాబీ బాస్ చేయాలని వారు కోరుకుంటున్నారు… రాష్ట్రంలో నెలకో రకంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి ఇలాంటి వారికి చెక్ పెట్టాలని గులాబీ శ్రేణులు కోరుకుంటున్నాయి.