లేని సిబ్బంది పేర జీతాలు…..?

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వివిధ పనుల నిర్వహణ కోసం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి… సిబ్బంది నియామకం, ఆసుపత్రిలో పనుల నిర్వహణ విషయంలో ఈ కాంట్రక్టర్ అంతగా శ్రద్ధ పెట్టకపోయిన అధికారులు అందరూ ఇతగాడికి సహకరిస్తుండడంతో మరింతగా రెచ్చిపోతున్నట్లు తెలిసింది… ఇదే ఆసుపత్రిలో షాడో సూపరిండెంట్ గా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడు కులం కోణంలో ఆలోచిస్తూ… తన బంధువు ప్రజాప్రతినిది కావడంతో ఈ కాంట్రాక్టర్ ఎం చేసిన ఆ షాడో సూపరిండెంట్ అన్ని విధాలా సహకారాలు అందిస్తున్నట్లు ఎంజీఎం లో ప్రచారం జరుగుతోంది… ఇంత జరుగుతున్న అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు…తాజాగా ఈ కాంట్రాక్టర్ జీతాల చెల్లింపు విషయంలో సిబ్బందికి రావాల్సిన మొత్తంలో అడ్డగోలుగా కోతలు విధించినట్లు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు…దీనికి తోడు ఎంజీఎం లో విధులు నిర్వర్తించని సిబ్బంది పేర సైతం ఈ కాంట్రాక్టర్ జీతాలు డ్రా చేసినట్లు తెలుస్తోంది…

లేని సిబ్బంది పేర జీతాలు.....?- news10.app

పని చేయని సిబ్బంది పేరా జీతాలు……?

ఎంజీఎం లో కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇక్కడ గతంలో పనిచేస్తున్న కొంతమందిని అలాగే కొనసాగిస్తూ అధిక మొత్తంలో కొత్త సిబ్బందిని నియమించాడు… టెండర్ మారగానే ఉద్యోగాలు దొరుకుతాయనే ఆశతో చాలామంది నిరుద్యోగులు ఈ కాంట్రక్టర్ నిర్వహిస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులను సంప్రదించారు…. వారిలో కొంతమంది ఉద్యోగం దక్కించుకున్న వారు ఓ పని చేస్తామని ధరకాస్తూ చేసుకుంటే మీరు ఈ పని కాక వేరే పని చేయాలని కాంట్రాక్టర్ అనడంతో వారు ఉద్యోగం నచ్చక మానేసి వెళ్లారు…ఈ మానేసిన సిబ్బంది పేర్లను ఉద్యోగ జాబితాలోంచి సదరు కాంట్రాక్టర్ తొలగించకుండా అలాగే ఉంచి వారు ఇప్పటికి ఎంజీఎం లో ఉద్యోగం చేస్తున్నట్లు అధికారులను తప్పుదోవ పట్టించి వారి పేర ఇప్పటికి కాంట్రాక్టర్ నెల నెలా జీతాలు మంజూరి చేయిస్తూ మూడో కంటికి తెలియకుండా నొక్కేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…

కాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గం లోని కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని కాంట్రాక్టర్ కు సిపార్స్ చేస్తే మంత్రి పేరు చెప్పి పోయిన వారందరినీ సానిటేషన్ పని చేయాలని కాంట్రాక్టర్ సూచించాడట… డిగ్రీ, పిజి చదువుకొని కంప్యూటర్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కోసం వెళ్లిన వారిని సానిటేషన్ పని చేయాలని చెప్పడంతో ఇష్టపడని వారు ఎం జి ఎం లో ఉద్యోగం చేయడం మానేశారు…ఇలా మానేసిన వారి పేరు పై సైతం కాంట్రాక్టర్ నెల నెలా జీతాలు తీసుకుంటుడడంతో ఇది తెలుసుకున్న నిరుద్యోగులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది…ఇది ఇలావుంటే అసలు సరిపడా సిబ్బందిని కాంట్రాక్టర్ నియమించుకున్న సిబ్బంది ఎంత మంది ఉన్నారో లెక్కాపత్రం లేకుండా ఎంజియం అధికారులు కాంట్రక్టర్ కు రావాల్సిన డబ్బులు ఎలా మంజూరి చేయిస్తున్నారో వారికే తెలియాలి…ఈ కాంట్రాక్టర్ విషయంలో ఎంజీఎం అధికారులు ఏమాత్రం నోరుమెదపకుండా ఎవరిని చూసి వెనకడుగు వేస్తున్నారో వారికే తెలియాలి…ఇలా అడ్డగోలుగా బిల్లులు మంజూరి చేయించుకుంటున్న కాంట్రాక్టర్ కు ఎంజీఎం అధికారులు ఇకనైనా చెక్ పెడతారా…?లేక అతడు చెప్పిందల్లా వింటూ ఒత్తిళ్లకు తల్లోగుతారా….? చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here