అవినీతి అధికారుల గుట్టు బయట పెడుతూ ప్రజలతరుపున వకాల్తా పుచ్చుకొని ముందుకు సాగుతున్న న్యూస్10 శనివారం సంచికలో వెలువరించిన “కోట్లు కొల్లగొట్టిన తహశీల్దార్” కథనానికి విశేష స్పందన లభించింది.కాగా అవినీతి చేయడంలో ఆరితేరిన ప్రస్తుతం ఓ మండల తహశీల్దార్ మాత్రం న్యూస్10 కథనంతో బెంబేలెత్తి పోయినట్లు తెలిసింది. గతంలో కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ కు సంబంధం లేని వేరే విభాగంలో పనిచేసిన సదరు తహశీల్దార్… కథనం వెలువడిన వెంటనే ఎం చేద్దాం… ఎలా చేద్దాం…?అంటూ తనతో లబ్ది పొందినవారికి… రెవెన్యూ శాఖ లో తనతో సన్నిహితంగా ఉండే వారిని సలహాలు అడగడం మొదలెట్టాడట… ఓ విషయంలో కొద్ధి గంటల్లో సస్పెన్షన్ ఖాయమని తెలిపోగానే పెద్ద స్థాయిలో పైరవి చేసుకొని సస్పెన్షన్ ఆర్డర్ కంటే ముందు బదిలీ ఆర్డర్ తెచ్చుకున్న ఘనుడు ఈ తహశీల్దార్ అని తెలిసింది.ఈ అవినీతి తహశీల్దార్ తాను చేసిన అక్రమాలు చాలదన్నట్లు తనను ఓదార్చే వాళ్లకు ఫోన్ లు చేసి సలహాలు తీసుకున్నట్లు తెలిసింది… వారయిన ఎం చేస్తారు ఎం కాదులే అని ఓదార్చారట… అంతేకాదు తన అక్రమాల చిట్టా అసలు న్యూస్10 కు ఎలా చిక్కింది…ఆ సోర్స్ ఎక్కడిదని సదరు తహశీల్దార్ ఆరా తీసినట్లు సమాచారం.ఇక తహశీల్దార్ కు కావాల్సింది సమకూర్చి తమ అక్రమాలను సక్రమాలు గా మార్చుకున్న కొన్ని అవినీతి గణాలు ఇలాంటి పనులు చేసేది .మా సారే అని గుర్తు పట్టి మరీ పరమర్శించారట.
మడికొండలో పట్టా కానీ భూమిని తన పరపతిని ఉపయోగించి పట్టా చేయించి అందుకు ప్రతిఫలంగా అప్పనంగా ఎకరం భూమిని తీసుకొని ఖర్చులు బాగా అవుతున్నాయి అని మాయమాటలు చెప్పి మరో ఐదు గుంటల భూమిని మొత్తంగా ఎకరం ఐదుగుంటల భూమిని కొట్టేసి న్యూస్10 కథనంతొ కొట్టేసిన భూమిని దాచేదెట్ల అంటూ తహశీల్దార్ తలపట్టుకున్నాడట. అలాగే వరంగల్ నగర శివారులో మల్లెతోట వివాదాన్ని పరిష్కరించి నిషేధిత భూముల జాబితా నుంచి ఆ భూమిని తొలగించి విలువైన రెండు వందల గజాల స్థలాన్ని ఓ ఐదు లకారాలు గిఫ్ట్ గా పొందిన తహశీల్దార్ మల్లె తోట భూవివాదం విషయాన్ని ఇప్పుడు ఎలా మాయ చేయాలని ఆలోచనలో పడ్డాడట. అంతే కాదు గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ విఆర్వో,వి ఆర్ ఎ సస్పెండ్ ఐయిన తిరిగి విధుల్లోకి తీసుకురావడానికి ఈ తహశీల్దార్ ఒక్కొక్క రి దగ్గర రెండు లక్షలకు పైగానే వసూలు చేసి నట్లు సమాచారం.ఇప్పుసు ఈ సొమ్ము వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడితే ఎలా…?అనే గుబులు కోట్లు కొల్లగొట్టిన తహశీల్దార్ కు పట్టుకుందట. అవినీతిలో ఆరితెరాడని పేరున్న ఈ తహశీల్దార్ అదనపు సొమ్ము నొక్కేందుకు బినామీ పేరుతో కాంట్రాక్టు లు సైతం చేసేవాడని తెలిసింది. ఇంతగా డబ్బులు వెనకేసిన తహశీల్దార్ కు ముందుచూపు కూడా బాగానే ఉన్నట్లు తెలిసింది.సంపాదించిన ఆస్తులన్ని తన దగ్గరి వ్యక్తి పేర ఉంచి వసూళ్ల భాగోతం సైతం ఈ వ్యక్తి ద్వారానే తహశీల్దార్ నడుపుతున్నట్లు తెలిసింది. కాగా కలెక్టరేట్ లో కొలువు చేసిన దగ్గరనుంచి నగర శివారులోని ఓ మండలానికి తహశీల్దార్ గా బదిలీ ఐయ్యే వరకు ఈ తహశీల్దార్ చేసిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నింటిని న్యూస్10 నిఘా టీమ్ సేకరించింది…
ఇదిగో “రాజేంద్ర” అవినీతి లీల….!
మరో సంచికలో….