ఓ వైపు రాష్ట్రం కరోనతో సతమతం అవుతుంటే అక్రమ మార్గం లో సంపాదనకు కొంతమంది తెగ బడుతున్నారు. లాక్ డౌన్ తో సర్వం బంద్ లో ఉంటే దానిని ఆసరాగా తీసుకుని కొందరు అక్రమ వ్యాపారం చేస్తూ తమ వక్ర బుద్దిని చాటుకుంటున్నారు. కరోన కారణం తో లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపులు మూత పడ్డాయి దీనితో కొంతమంది అక్రమ మద్యం వ్యాపారానికి తెర తీశారు.
ఈ పరిస్థితి రాష్ట్రమంతటా కొనసాగుతుండగా అక్కడక్కడ అక్రమార్కులు పట్టు బడుతున్నారు తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా కమలపూర్ మండలం లో మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ భర్త కట్కూరి తిరుపతి రెడ్డి, అక్రమ మద్యం కేసులో పోలీసులు చేతిలో బుక్ అయ్యాడు ఈయన తో పాటు కొండమీది రవి అనే అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డ వీరినుంచి రూ.1.36 లక్షల మద్యం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.