- మహిళ ఎస్సై పై టీఆర్ఎస్ నాయకుల జులుం…
- ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
మేం అధికార పార్టీకి చెందినవారిమి…తలుచుకుంటే నిమిషాల్లో నిన్ను సస్పెండ్ చేయిస్తాం. మా పెళ్లి ఊరేగింపునే అడ్డుకుంటావా అంటూ నెక్కండలో గులాబీ నాయకులు కొందరు మహిళ ఎస్సైపై చిందులేశారు. అర్ధరాత్రి పెళ్లి ఊరేగింపులో డి జే పెట్టి రణ గొణ ధ్వనులతో స్థానికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన ఎస్సై నే దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నెక్కొండ లో టీఆర్ఎస్ నాయకుడు పీఎసీఎస్ చైర్మన్ మారంరాము మేనల్లుడి పెళ్లి ఊరేగింపు ఎలాంటి పర్మిషన్ లేకుండా డీజే పాటలతో ఈనెల 8న అర్దరాత్రి ఊరేగింపు చేస్తుండగా డ్యూటీ లో ఉన్న పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో టీఆర్ఎస్ లీడర్లు పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేగాక సంఘటన స్థలానికి చేరుకున్న మహిళ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు రెండు రోజుల్లో ట్రాన్స్ ఫర్ చేయిస్తామంటూ దుర్బషలాడారు. దీంతో జరిగిన సంఘటనంత వీడియో తీసిన సదరు ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది పీఎసీఎస్ చైర్మన్ మారం రాము తో పాటు టీఆరెస్ నాయకులు తాటిపల్లి శివకుమార్, కారింగుల సురేష్, మారం భగత్, తాటిపల్లి శరత్ లపై కేసు నమోదు అయినట్లు సమాచారం.