రాజకీయాల్లో దమ్ము, ధైర్యం ఉన్న ప్రశ్నించే తత్వం తెగింపు ఉన్న సరైన వేదిక లేకపోవడం ఎవరికైనా ఓ మైనస్ పాయింట్ గానే ఉంటుంది… దానికి సరైనా వేదిక దొరికిన సముచిత ప్రాధాన్యం ఆ పార్టీలో దక్కకుంటే ఎన్ని ఉన్నా రాజకీయంగా రాణించడం కష్టంగా మారుతుంది… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తుంది… టీడీపీ లో ఓ వెలుగు వెలిగి మహాసముద్రంగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సీజేరిన దగ్గరి నుంచి పార్టీని ఓ గాడిలో పెట్టి ఏకతాటి పైకి నాయకులను తెచ్చి, కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ ధైర్యం నింపాలని చూసిన ఆయన కల ఎప్పటికి నెరవేరేలా లేదట… సీనియర్ ల మనే పేరుతో కొందరు పార్టీ అభివృద్ధి కి అడ్డుపడుతున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్న… మరోవైవు టీపీసీసీ విషయంలో ఇప్పటికి అధిష్టానం అధ్యక్షుడెవరో తేల్చకుండా ఆలస్యం చేయడం… సీనియర్ లను కాదని రేవంత్కు ఇస్తే మేం వెళ్లిపోతామని కొందరు బహిరంగంగానే అల్టిమేటం అధిష్టానానికి జారీ చేయడం… ఇవన్నీ జరుగుతున్న అధిష్టానం నెమ్మదిగా వ్యవహరించడం రేవంత్ లో నిరాశను నింపాయనేది టాక్… ఎందుకు గత కొద్ది రోజులుగా రేవంత్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అవడం, అడపా దడపా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్కు ఆశలు ఉన్న అదంతా సులభం గా లేదని తేలడం, అక్కడ కాంగ్రెస్ విఫల మైతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోయే పరిస్థితి ఉండడంతో రేవంత్ పార్టీ మారాలని యోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది..
తెలంగాణ జన సమితి లోకి రేవంత్…?
నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేసి. మూడో స్థానంలో నిలిచిన కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి లో రేవంత్ రెడ్డి త్వరలోనే చేరనున్నాడనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనాల్లో మంచి పాలోయింగ్ ఉన్న రేవంత్ కోదండరాం తో జత కలిస్తే ఓ ప్రాంతీయ పార్టీగా వచ్చే ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపవచ్చని అందుకే కాంగ్రెస్ ను వీడి రేవంత్ టి జే ఎస్ జెండా అందుకొనున్నాడనే ప్రచారం జోరుగానే సాగుతుంది.గతంలో సొంతంగానే పార్టీ పెడతాడానే ప్రచారం బాగానే జరిగిన ఆ విషయం జోలికి పోనీ రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపి ఓ దశలో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం పొందుతాడానే ప్రచారం జరిగిన కోదండరాం పార్టీలో చేరడానికి రేవంత్ కాస్త సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది… ఇదే కనుక జరిగితే తెలంగాణలో టి జే ఎస్ ప్రభావం చూపుతుందని రేవంత్ రాకతో మరికొంతమంది సీనియర్ నాయకులు సైతం టి జే ఎస్ లోకి క్యూ కడతారని సమాచారం.ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకున్న దూకుడు, అనుభవానికి తెలంగాణ జన సమితి మాత్రమే సరైన వేదికని రేవంత్ బావిస్తున్నాడని త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తాడోపేడో తేల్చుకొని రేవంత్ టీజే ఎస్ లోకి రావడం ఖాయమని కొందరు అంటున్నారు… ఏది ఏమైనా రేవంత్ తెలంగాణ జన సమితిలో అడుగుపెడితే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది… మరి రేవంత్ ఎం నిర్ణయం తీసుకుంటాడో… అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తాడో వేచిచూడాలి.