న్యూస్10 కథనానికి స్పందన

సర్వే నెంబర్ 28 లోనే బతుకమ్మ స్థలం
స్థల పరిశీలన చేసిన వెంకటాపురం తహశీల్దార్, ఎంపిడిఓ
కబ్జా స్థలంపై విచారణ జరుపుతామని వెల్లడి

న్యూస్10 కథనానికి స్పందన- news10.app

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవిరంగాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 28 లోనే బతుకమ్మ స్థలం కేటాయింపుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ నెల 15 న” కలెక్టర్ సార్ ఇదేంది “…? శీర్షికన న్యూస్ 10 కథనాన్ని వెలువరించింది. ప్రభుత్వ భూమిలో బతుకమ్మ స్థలం లేకుండా ప్రకృతి వనం నిర్మిస్తున్నారని 34 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా ఐయితే ఆ భూమిని వదిలి బతుకమ్మ భూమిని గుంజుతున్నారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య దృష్టికి కథనం ద్వారా న్యూస్10 తీసుకువెళ్లింది… ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ సర్వే నెంబర్ 28 లోనే బతుకమ్మ స్థలం ఉండాలని అధికారులను ఆదేశించారు… దింతో స్థానిక తహశీల్దార్, ఎం పి డిఓ బతుకమ్మ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 28 సర్వే నెంబర్ లో కబ్జా ఐయిన భూమిని సైతం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని… కబ్జా ఐయిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చెసుకుంటామని రెవెన్యూ అధికారి తెలిపారు.