అనుమతులు నిల్….ఆకర్షణ ఫుల్

ఎకరాల్లో ఉన్న భూమిని అందంగా ముస్తాబు చేశారు.భూమిని మొత్తం చదును చేసి అద్దంలా మార్చారు… ప్రహారి కట్టి రంగురంగుల జెండాలు పాతి వెంచర్ దందా మొదలుపెట్టారు.అనుమతులు ఏవి లేకున్నా గజాలు గుంటల్లో అమ్మకాలు మొదలుపెట్టారు… మేం అమ్ముతాం కొనుగోలు చేసినవారి ఖర్మ అన్నట్లు జనం చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఇది ఎక్కడో కాదు వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ 17 వ డివిజన్ గాడిపల్లి లో ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ వేసి రియల్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు కొందరు. మల్లికార్జున డెవలపర్స్ పేరుతో అనుమతిలేని వెంచర్ దందాకు శ్రీకారం చుట్టారు.

అనుమతులు నిల్....ఆకర్షణ ఫుల్- news10.app

నాల కన్వర్షన్, కుడా అనుమతి లేదు

సాధారణంగా వెంచర్ చేయాలంటే వ్యవసాయ భూమిని నాల కన్వర్షన్ చేయాలి. ఆ తర్వాత కుడా పరిధిలో ఈ భూమి ఉంది కనుక కుడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి… కానీ ఈ వెంచర్ యాజమాన్యం అటు నాల కన్వర్షన్ చేయకుండా, ఇటు కుడా అనుమతి తీసుకోకుండానే వెంచర్ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది.

గజాలు, గుంటల్లో అమ్మకం…

ఈ భూమికి నాల కన్వర్షన్ చేయలేదు కనుక రిజిస్ట్రేషన్ లు చేయడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో
ఈ వెంచర్ యాజమాన్యం గుంటల లెక్కన ఈ వెంచర్ లోని భూమిని విక్రయించి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు సమాచారం. గుంటకు ఐదు లక్షలు మాత్రమే అని ఆఫర్లు కూడా ఇస్తున్నారట.గజాల చొప్పున అయితే నాలుగు వేలకు విక్రయిస్తున్నారట.

రెవెన్యూ, కుడా అధికారులు ఏంచేస్తున్నట్లు?

17 వ డివిజన్ పరిధిలోని ఖిలా వరంగల్ మండలం గాడిపల్లి లో అక్రమంగా వెంచర్ వేసి ఇంత బహిరంగంగా వ్యవసాయ భూమిని నాల కన్వర్షన్ లేకుండా ఫ్లాట్లు చేసి విక్రయాలు జరుపుతుంటే మండల రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కుడా పరిధిలో కుడా అనుమతులు లేకుండా వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతున్నారంటే ఈ వెంచర్ యజమానులకు కుడా అధికారుల ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు ఈ అక్రమ వెంచర్ పై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here