జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం లో ఏర్పాటు చేసిన ఆ రెడీ మిక్స్ ప్లాంట్ దుమ్ముకొడుతుంది. ఈ రహదారి పై వెళ్తున్న వారు ఈ దుమ్ము మూలంగా ఇబ్బందులు పడుతున్నారు… కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఆ శాఖ అధికారులు మాత్రం తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రెడీమిక్స్ ప్లాంట్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం పరిధిలో ప్రధాన రహదారి పక్కనే రెడీమిక్స్ ప్లాంట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారు దాని వల్ల ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.. సాధారణంగా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారులకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటుచేయాల్సి ఉన్న ఈ ప్లాంట్ యాజమాన్యం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు ప్రదానరహదారికి అతిసమీపంలో ఏర్పాటు చేశారు.ఈ ప్లాంట్ నిర్వహిస్తున్న సమయాల్లో వస్తున్న దుమ్ము మూలంగా రహదారిపై నుంచి వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు… ఈ విషయంపై ఇప్పటికే పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది… ఇప్పటికి ఈ ప్లాంట్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు.
రెడీమిక్స్ ప్లాంట్ కు అనుమతి ఎలా ఇచ్చారు?
సాధారణంగా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహించాలంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది ఈ అధికారులు అన్ని విధాలుగా అంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రజలు తిరిగే ప్రాంతాలకు దూరంగా ప్రధాన రహదారులకు కనీసం 100 మీటర్ల కు దూరంగా ఉందా లేదా అని పరిశీలించిన అనంతరమే అనుమతి ఇస్తారు.కానీ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లో మైలారం గ్రామ పరిధిలో ప్రధాన రహదారి ని ఆనుకొని ఉన్న ఈ రెడీమిక్స్ ప్లాంట్ కు ఎలా అనుమతి ఇచ్చారో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకే తెలియాలి.ఈ ప్లాంట్ అనుమతి విషయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్న ఈ రేడిమిక్స్ ప్లాంట్ పై అధికారులు చర్యలు తీసుకుంటారా… లేదా చూడాలి