తనపై దాడి విషయంలో ప్రముఖ గాయకుడు రాహూల్ సిప్లిగంజ్ స్పందించారు. పబ్బులో అమ్మాయిలపై కామెంట్స్ చేస్తుండడంతోనే తాను ప్రశ్నించగా… దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సోదరుడు ఉద్దేశపూర్వకంగా అతడి మిత్రులతో కలిసి దాడి చేశారని తెలిపారు. వాష్ రూమ్ నుంచి కొందరు వస్తూ తనను డ్యాష్ ఇవ్వగా… ఎందుకు ఎలా చేస్తున్నారని ఓ వ్యక్తి రితిశ్ రెడ్డి తనను దుర్భాషలాడుతూ దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జరిగిన ఘటనలో బలగం చూపించడానికి వారు దాడి చేశారని ఆరోపించారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎంత పెద్ద వాళ్లయినా తాను ఈ కేసును ఉప సంహరించుకోవాలని.. ఎంతవరకైనా పోరాడుతానని ప్రకటించారు. పబ్ లో తాను ఓ పాట పాడి పార్టీ ముగిసిన అనంతరం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మొదట వాళ్లే దాడి చేశారని తెలిపారు. ఈ దాడి సమయంలో ఇద్దరు బౌన్సర్లు ఉన్నా దాడి చేసే వారిని నియంత్రించలేకపోయారని పేర్కొన్నారు. ఒక గ్యాంగ్ తో వచ్చి రూబాబ్ గిరి చూపించేందుకు యత్నించారని చెప్పారు. రితేశ్ రెడ్డిపై గతంలోనే ఎన్నో కేసులు ఉన్నాయని నాకు తెలిసిందని చెప్పారు. రాత్రి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందిన అనంతరం స్టేషన్ కు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం స్టేషన్ కు వచ్చి.. దాడి చేసిన వారి వివరాలు తెలుసుకుని వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు వారిని శిక్షించేంత వరకు తాను వదలనని స్పష్టం చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వంపైన తనకు నమ్మకం ఉందని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు భావించారు. ఎమ్మెల్యే తన సోదరుడు లేడని బంధువులు ఉన్నారని పేర్కొనగా… అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఏం జరుగుతాయో చూద్దామని తెలిపారు. తనతో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని ప్రశ్నించడంతో ఈ ఘటనకు కారణమైందని వారంతా పది మందికిపైగా ఉన్నారని వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ ఫిర్యాదులో రాహుల్ పేర్కొన్నాడు. పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.