గురుకులాల సమస్యలు గాలికొదిలేసి ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తు, విద్యార్థి సంఘ నాయకుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ… అసలు విద్యార్థి సంఘనాయకులు గురుకుల విద్యాసంస్థల్లోకి ప్రవేశించకూడదని హుకుం జారిచేసినట్లు మాట్లాడిన గురుకులాల వరంగల్ రీజినల్ కోఆర్డినేటర్ ,భూపాలపల్లి గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ న్యూస్10 కథనం తో తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలిసింది… ఈ ఇద్దరు ఓ అడుగు ముందుకు వేసి అసలు న్యూస్10 లో కథనం ఎలా వచ్చిందంటూ ఆరాతీస్తున్నట్లు సమాచారం… గురుకుల విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరిస్తాం విద్యార్థి సంఘం ఇచ్చిన ఫిర్యాదు పై స్పందిస్తాం అని చెప్పాల్సిన రీజినల్ కోఆర్డినేటర్, ప్రిన్సిపాల్ ఆ విషయం ఏమాత్రం చెప్పకుండా అసలు సమస్యల పరిష్కారంపై తమ ఉన్నతాధికారులకు ఎలాంటి నివేదికలు పంపకుండా….వార్త కథనం ఎలా వచ్చింది….?అసలు ఈ విషయంలో న్యూస్10 కు ఎవరు ఉప్పందించారు….?అనే విషయంలో వారికి ఉన్న పరిచయాల ఆధారంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.అంతేకాదు న్యూస్10 లో కథనం రావడంతో ఉన్నతాధికారులనుంచి తమకేం తాఖీదులు రాకుండా ఓ వైపు రీజినల్ కో ఓఆర్డినేటర్ , మరో వైపు గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది…ఇది ఇలావుంటే ఆర్సీఓ,భూపాలపల్లి గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై న్యూస్10 వెలువరించిన కథనం గురుకులాల ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది…. ఆర్ సి ఓ గురుకులాల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించకుండా కొంతమంది ఉద్యోగులతో సఖ్యత గా ఉంటూ వారు చెప్పిన మాటలు వింటూ తనకు నచ్చని ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు…. భూపాలపల్లి గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కుల వివక్షను చూపుతున్నట్లు ఆరోపణలు సైతం వినవస్తున్నాయి….ఈ ప్రిన్సిపాల్ ఆర్ సి ఓ కు బాగా దగ్గర కావడం వల్ల ఎన్ని ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యం గానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది….
గురుకులంలో కులం కుంపటి…..?
భూపాలపల్లి గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీరే వేరు….
మరో సంచికలో…..