వరంగల్ జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అసంతృప్తి రాజుకుంటుంది.ఈ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు జోరుగా వినవస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం పార్టీలో చేరి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన బీజేపీ సీనియర్ లను అసలే కలుపుకు పోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. దీని మూలంగా ఆయన సొంత నియోజకవర్గం వర్ధన్నపేట లొనే తీవ్ర విమర్శలు వస్తుండగా ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటం వల్ల కొంతమంది నాయకులు ఇటీవల బీజేపీ ని వదిలి గులాబీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం లోని ఓ మండలం లో సీనియర్ లను పక్కన పెట్టడం వల్ల వారు బీజేపీ కి దూరమయినట్లు తెలిసింది.అధ్యక్షుడి కొన్ని నిర్ణయాల మూలంగా చాలామంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా కొంతమంది పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బి జె వై ఎం లో ముసలం….?
వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ నిర్ణయాల వల్ల ప్రస్తుతం వరంగల్ జిల్లా బి జె వై ఎం లో .ముసలం పుట్టినట్లు తెలిసింది.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ కార్పొరేటర్ గా గట్టి పోటీనిచ్చిన బి జె వై ఎం అధ్యక్షుడు సిద్ధం నరేష్ పటేల్ కు ఎంతమాత్రం చెప్పకుండా ఇంకా ఆయన పదవి కాలం ముగియకుండానే రాత్రికిరాత్రే తన వెంట తిరిగే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు చెప్పడం ఇప్పుడు వరంగల్ బి జె వై ఎం ల్ వివాదానికి కారణం అవుతుంది.పార్టీలో ఉన్న సీనియర్ నరేష్ ను కాదని ఎలాంటి సమాచారం లేకుండా మొన్నటికి మొన్న పార్టీలోకి వచ్చిన పిట్టల కిరణ్ అనే వ్యక్తికి బి జె వై ఎం పదవి కట్టబెట్టడం ఏంటని సిద్ధం అనుచరులు ప్రశ్నిస్తున్నారు.తనకు నచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తూ మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న వారిని జిల్లా అద్యక్షుడు దూరం పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అన్ని రకాలుగా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోవడం మూలంగానే మాటమాత్రం కూడా చెప్పకుండా సిద్ధం నరేష్ ను బి జె వై ఎం జిల్లా అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టి బిజెపి లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి పదవి కట్టబెట్టడం పై సిద్ధం అనుచరులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.కాగా వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇలా వ్యవహరిస్తుండడం వల్ల ఇటీవల వరంగల్ తూర్పు లో కొంతమంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ ఎస్ పార్టీ లో చేరినట్లు స్వయంగా తూర్పులో బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు భేఖాతర్….?
జిల్లాల విభజన ముందు నుంచి పదవుల్లో కొనసాగుతున్న వారిని అలాగే పదవుల్లో కొనసాగనిస్తూ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మాత్రమే పదవులు భర్తి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు జారిచేయగా ఆ ఆదేశాలు వరంగల్ జిల్లా అధ్యక్షుడు భేఖాతర్ చేసినట్లు కనపడుతుంది. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనను ప్రసన్నం చేసుకున్నవారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా వరంగల్ జిల్లా బి జె వై ఎం అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పు చేయవద్దని బండి సంజయ్ చెప్పిన ఆ మాటలను పెడ చెవిన పెట్టి కావాలని సిద్ధం నరేష్ ను పదవి నుంచి తప్పించినట్లు ప్రస్తుతం వరంగల్ బీజేపీ లో జోరుగా చర్చ జరుగుతుంది.ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర అధిష్టానం దృష్టికి వెళ్లగా అధిష్టానం వరంగల్ అధ్యక్షుడి తీరుపై సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పార్టీ కోసం శ్రమిస్తున్న తనను అకారణంగా పదవినుంచి తొలగించారని సిద్ధం నరేష్ సైతం త్వరలో బండి సంజయ్ ని కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇది ఇలావుంటే పదవుల కేటాయింపు విషయంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడిపై విమర్శలు రాగ ఆయన దానిని కప్పి పుచ్చేందుకు పదవులు ఇంకా ఎవరికి ఇవ్వలేదని తనకు తెలియకుండా ఆ జాబితా ఎవరో లీక్ చేశారని అంటున్నట్లు తెలిసింది.పదవుల కేటాయింపు జరిగినట్లు బయటకు వచ్చిన జాబితాలో అధ్యక్షుడి సంతకం లేకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది.. మొత్తానికి వరంగల్ జిల్లా బీజేపీ లో ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలపై అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. తనకు నచ్చిన వారికి కేవలం తనను ప్రసన్నం చేసుకున్నవారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.మరి ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.