అరకొర సహాయక చర్యల పై ఉప సభాపతి తీగుల్ల పద్మారావు కోపం చేశారు.
ప్రస్తుతం ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు అందరూ ముందుకు రావాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు అన్నారు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల పై ఆశ్రయాన్ని పొందుతున్న 250 మందికి పైగా నిరాశ్రయులను ghmc అధికారులు లాలాపేట లోని ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం లో ఆశ్రయాన్ని కల్పించి ప్రత్యెక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు శనివారం ఆకస్మికంగా తనిఖి చేశారు. శిబిరంలో ఆశ్రయం పొందుతున్న వారితో ముఖముఖీని నిర్వహించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ శిబిరంలో ఆశ్రయం పొందుతున్న వారికీ అరకొర సదుపాయాలు కల్పించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఆదివారం నుంచే తానే ఆహారాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
పలుఫురికి వైద్య సదుపాయాలను కల్పించేందుకు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో టెలిఫోన్ ద్వారా చర్చించారు. పలు ఆసుపత్రుల అధికారులతో సంప్రదించారు. మంచి నీటి సదుపాయాన్ని కల్పించాలని, సివరేజి ఇబ్బందులను నివారించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ghmc ఉప కమీషనర్ రవి కుమార్ మాట్లాడుతూ వివిధ సదుపాయాలను కల్పిస్తున్నామని, ఉప సభాపతి ఆదేశాల మేరకు వెంటనే ఆయా సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.ప్రాజెక్ట్ అధికారి తిరుపతయ్య, కార్పొరేటర్ సామల హేమ, టీవీ యాంకర్ కత్తి కార్తిక తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలని, అదే సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఔదార్యంతో ఆదుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.