గ్రేటర్ వరంగల్ నగరంలో పేదలు ఏ చిన్న ఇంటిని నిర్మించుకున్న సవాలక్ష ప్రశ్నలు, నిబంధనలతో భయపెట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్ద పెద్ద నిర్మాణాల విషయంలో మాత్రం రూల్స్ గీల్స్ జాన్తా నై అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి… ఇదిగో అక్రమ నిర్మాణం అని బయటపెట్టిన చర్యలు తీసుకోవడానికి వారికి మనసు రావడం లేదు….ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు ఏంటో అందరికి తెలిసిన అధికారులు మాత్రం చర్యలకు ససేమిరా అంటూ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది.
కమిషనర్ చర్యలు తీసుకోవాలి…
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాల విషయంలో కమిషనర్ దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు…. అడ్డగోలుగా అనుమతులు లేకుండా సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.హన్మకొండ పరిధిలో అదాలత్ ప్రాంతంలో పై అంతస్తులకు అనుమతి లేకుండా, కనీస సెట్ బ్యాక్ లేకుండా నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణం పై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.
పక్షం రోజులు గడిచిన….
హన్మకొండ అదాలత్ ప్రాంతంలో పై అంతస్తుల కు అసలు అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న భవన యాజమాన్యానికి 48 గంటల గడువు విధిస్తూ నోటీసులు జారీచేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు పక్షం రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. అక్రమనిర్మాణం దర్జాగా నిర్మితమవుతున్న చర్యలు శూన్యం కావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
కమిషనర్ దృష్టిలో ఉందా….?
అసలు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాల విషయం టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నార లేదా అనే అనుమానం కలుగుతోంది… అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్న అసలు చర్యలు శూన్యం కావడంతో అధికారులు అసలు ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం లేదని అందుకే చర్యలు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది… కమిషనర్ ఈ నిర్మాణాలపై చొరవచూపి దృష్టి సారిస్తే అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించడం ఖాయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమమవుతుంది…
అక్రమ నిర్మాణాల పై రాస్తే అసహనం….
నగరంలో పెరిగిపోతున్న అక్రమనిర్మాణాలపై న్యూస్10 గత కొద్దిరోజులుగా కథనాలు వెలువరిస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ లేని అసహనాన్ని ,ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు… వివరణ కోసం కార్యాలయం చుట్టూ తిరిగిన టౌన్ ప్లానింగ్ అధికారి కనీసం ఐదు నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడంలేదు సరికదా వివరణ కోసం ఫోన్ చేసిన న్యూస్10 ప్రతినిధితో అమర్యాద గా మాట్లాడుతున్నారు….నీకు ఐడి కార్డు ఉందా… అక్రిడిటేషన్ ఉందా అంటూ తన పరిధి దాటి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు… ఇలాంటి బెదిరింపులకు న్యూస్10 ఎప్పుడు బయపడదని సదరు అధికారి స్పష్టం చేస్తున్నాం… త్రినగరం లో బడా బాబుల అక్రమ నిర్మాణాల బండారం త్వరలోనే బయటపెడతామని చెప్తున్నాం…