బెదిరింపులకు లొంగే ఉద్యమకారున్ని కాదు …

ఉద్యమకారుడు కొమ్మిని సురేష్ కుమార్ తో న్యూస్10 ముఖాముఖి…

గడిచిన 20 సవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమం లో ఉంటూ లాఠీ దెబ్బల కు ఓర్చి జైలు జీవితం అనుభవించి ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణ పై ఉన్న అభిమానం తో మన బ్రతుకులు మారుతాయని నా చివరి శ్వాస తెలంగాణ కొరకే అని అనుకున్న ప్రతి ఉద్యమకారుడి కి తెలంగాణ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది గత రెండు దఫాలుగా ఆశతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేటర్ ఎన్నికల్లో టికెట్ ఆశించి చివరి క్షణంలో బంగపడ్డ ఎన్ని అడ్డంకులు ఎదురైన ఎవ్వరు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా వెనుకడుగు వేసేది లేదని అంటున్న తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు 39 వ డివిజన్ స్వతంత్ర బ్యాట్ గుర్తు అభ్యర్థి కొమ్మిని సురేష్ తో కూచన సంతోష్ కుమార్ ముఖా ముఖి……

బెదిరింపులకు లొంగే ఉద్యమకారున్ని కాదు ...- news10.app

న్యూస్10: తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు జరిగిన అన్యాయం ఏంటి…..?

కొమ్మిడి సురేశ్ : గత 20 సవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని ఒడిదొడుకుల ఓర్చు టీఆరెస్ పార్టీకి అనేక సేవాలందించాను 2009లో చివరకు జైలు పలు కూడా అయినప్పటికీ గత ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశించాను ఇవ్వలేదు ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో అయినా టికెట్ ఆశించాను నమ్మకంతో నన్ను నామినేషన్ వేసుకొమ్మని చెప్పిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఫార్మ్ కేటాయించే చివరి క్షణం వరకు నాకు ఆశ చూపి చివరకు చేతులెత్తేశారు చివరకు నేను నాతోటి ఉద్యమకారులు నన్ను నమ్ముకున్న కార్యకర్తలను విచారించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాను తెలంగాణ ఉద్యమకారులకు ఇలా అన్యాయం చేస్తే ప్రభుత్వం పడిపోవడం కాయమే

న్యూస్10: ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని ఆంధ్రా పాలకులు కేసులు పెట్టినప్పటికి తట్టుకున్నారు… తెలంగాణ వచ్చినాక మీకు జరిగిన న్యాయం ఏంటి…?

కొమ్మిడి సురేశ్ : ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలు పాలు అయ్యాను 2009 లో మా ఉద్యమకారుల పై కేసులు బనాయించి జైలుకు పంపారు అప్పుడు అలా అన్యాయం జరిగింది కోట్లాడి సాదించుకున్న తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది.

న్యూస్10: ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్ వస్తుందని ఆశించారు…. అసలు ఏం జరిగింది…?

కొమ్మిడి సురేశ్ : టీఆరెస్ పార్టీ అవిర్భవించాక తెలంగాణ ఉద్యమం మొదలయినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ నుండి ఎటువంటి పడవులు ఆశించకుండా పార్టీ కొరకు ఎన్నో పనులు చేసాను గతంలో టికెట్ కేటాయిస్తానని ఇవ్వకుండా చేశారు ప్రస్తుత గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా పార్టీ టికెట్ కేటాయిస్తుందని అనుకున్న నన్ను ప్రజా ప్రతినిదులు నమ్మించి మోసం చేశారు

న్యూస్10: గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చివరి క్షణం వరకు టికెట్ ఇస్తానని నమ్మబలికిన నాయకుల అంతరంగం బయట పడిందా…మీరు ఏమంటారు?

కొమ్మిడి సురేశ్ : ఉద్యమ కారులకు మొదటి నుండి అన్యాయం జరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా ఏముంది ఈ ప్రభుత్వం కూడా నిరూపించుకుంది పార్టీలో కష్టపడి పని చేసే వారికి విలువ ఇవ్వకుండా కబ్జాదారులకు డబ్బున్న బడా బాబులకు టికెట్ కేటాయించి ప్రభుత్వం ఉద్యమకారులకు అన్యాయం చేసింది.

న్యూస్10: ప్రస్తుత ఎన్నికల్లో 39 వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు గెలుస్తారని అనుకుంటున్నారా…?

కొమ్మిడి సురేశ్ : డివిజన్ ప్రజల ఆశీస్సులు నా పై ఉన్నాయి ప్రచారంలో ప్రతి ఒక్కరు అయ్యో బిడ్డా నీకు టికెట్ రాకుండా చేశారు అయినా పర్వాలేదు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని ఆశీర్వదిస్తున్నారు వారిచ్చే మాటలోనే నాకు అర్థం అయింది నేను గెలిచినట్టే అని నా వెన్నంటి ఉండే కార్యకర్తలు ప్రచారంలో అహర్నిశలు నా గెలుపు కొరకు పాటు పడితున్నారు వారిచే గౌరవానికి కృతజ్ఞుడనై ఉంటాను వీరందరి అండ దండలు ఉన్నాక నేను తప్పకుండా గెలుస్తా గెలుపు మాదే ఉద్యమకారులదే.

న్యూస్10: మీ గెలుపు పై నమ్మకం ఉందని అనుకుంటున్నారా…. మీ సహచరులు సహాయం చేస్తారని అనుకుంటున్నారా…?

కొమ్మిడి సురేశ్ : తప్పకుండా వారిలో కూడా ఉద్యమం ఉంది కొందరు నాతో ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారు వారి స్ఫూర్తి తో ఆదేశాల తో తప్పకుండా నాకు సహాయం చేస్తూనే ఉంటారు చేస్తున్నారు వారి ప్రోద్బలంతోనే మేము గెలుస్తున్నాం గెలిపించి చూపిస్తారు.

న్యూస్10: కేవలం ఉద్యమంలో పాల్గొన్న వారు మాత్రమే మీతో డివిజన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది….?

కొమ్మిడి సురేశ్ : ఉద్యమంలోనే కాదు డివిజన్ ప్రజలు నా వెన్నంటి ఉండి నడుస్తున్నారు ఎందుకంటే డివిజన్ పేదలకు పెన్షన్ లు కళ్యాణాలక్ష్మి ,షాదీ ముభారఖ్ ఇంకా కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన రోజుల్లో ప్రతి రోజు ఎదో ఒక రూపంలో వారిని ఆదుకోవడం జరిగింది నిత్యావసర వస్తువుల పంపిణీ వార్డుల వారిగా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాను అందుకే ప్రజల్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది నమ్మకం ఉంది ప్రజలు తెలంగాణ ఉద్యమకారుడు అయిన నాకు స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తు తో బరిలో ఉన్నానని నన్ను తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది.

న్యూస్10: గతంలో మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమకారుడిగా ఉండి గెలిచాక మళ్ళీ అదే బాట పడతారనే నమ్మకం ప్రజలకు ఉందంటారా….?

కొమ్మిడి సురేశ్ : నేను ఉద్యమకారుడిని ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను డివిజన్ అబివృద్ది ఎలా ఉండాలో ఒక ఉద్యమకారుడిగా నాకు అవగాహన ఉంది తప్పకుండా డివిజన్ అబివృద్ది చేసి చూపెడుతాను ప్రజలు గెలిపించాక ప్రజల ఆలోచన మేరకే వారి మాటకు కట్టుబడి ఉంటాను.

న్యూస్10: ఏ నినాదం తో ప్రజల ముందుకు వెళుతున్నారు డివిజన్ అబివృద్ది ఎలా ఉండబోతుంది….?

కొమ్మిడి సురేశ్ : నా అనుభవం ప్రకారం నాకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా 20 సంవత్సరాల అనుభవం ఉంది నేను చూసిన అబివృద్ది వేరు చేయబోయేది వేరు నేను గెలిచాక మీరే చూస్తారు గెలిపించుకున్న ప్రజలకు ప్రజల సమస్యలు తీర్చుకుంటు డివిజన్ అభివృద్ధిలో ఆదర్శ డివిజన్ గా తీర్చి దిద్దటానికి ప్రయత్నం చేస్తాను.

న్యూస్10: చివరగా మీకు టికెట్ రాలేదని స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు ప్రజలు గెలిపించాక పార్టీ మారరని నమ్మకం ఇస్తారా…?

కొమ్మిడి సురేశ్ : తప్పకుండా అది ప్రజల అభీష్టం మేరకే వదిలిపెడుతాను ఉద్యమకారుడికి అన్యాయం చేసిన నాయకుల కు నేనేంటో నిరూపిస్తా మరో ఉద్యమం లా 39 వ డివిజన్ లో ప్రచారం కొనసాగిస్తా ఉద్యమం అంటే ఇలా ఉంటుందా అని అధికార పార్టీ నాయకులకు చూపిస్తా ఏది ఏమైనా ప్రజల కోరిక మేరకు ఏ నిర్ణయం అనేది తరువాత చూడాల్సిందే.