కరోన విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మెడికల్ షాపులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పింది. శనివారం మధ్యాహ్నం తాజా ఆదేశాలను జారీ చేసింది.దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది.
వాటి కారణంగా స్వల్పంగా రిలీఫ్ వుండడంతో కరోనా పరీక్షలకు కొందరు రావడం లేదన్న ఉద్దేశంతో మెడికల్ షాపులపై ఆంక్షలకు తెరలేపింది కేసీఆర్ ప్రభుత్వం.దగ్గు, జలుబు, జ్వరం అని వస్తే మందులు అమ్మొద్దని హెచ్చరించింది.కరోనా నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ.
జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మెడికల్ షాపులు, అసోసియేషన్లకు సైతం అధికారులు ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం కరోనా లక్షణాలు కావడంతో అవి కనిపించిన వారు ప్రభుత్వం ఇచ్చే మందులను మాత్రమే వాడాలని, వారికి రెగ్యులర్గా వాడే మందులను విక్రయించవద్దని తాజా ఆదేశాలలో పేర్కొన్నారు. ఎలాంటి రొంప జ్వరం ఉన్నా… ఇక వైద్యుల వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి తాజా ఆదేశాలతో కలుగుతుంది. వారిని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మేరకు క్వారెంటైన్, ఐసొలేషన్ వార్డులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. లేకపోతే.. అవసరమైన మందులిచ్చి ఇంటికి పంపాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.