కదలరు……. మెదలరు

మాధవ, సిరి క్రషర్ లపై చర్యలేవి?
మంత్రుల సమీక్షలో అంతా ఒకే అంటారు……. క్షేత్ర స్థాయిలో చర్యలకు వెనకాడుతారు
ఎస్సారెస్పీ కాలువలపై అసలు పట్టింపే లేని అధికారులు
క్రషర్ యజమానులు ఎస్సారెస్పీ కాలువ రహదారులను వాడుతున్న నోరు మెదపని వైనం

క్రషర్ యజమానులపై ఎందుకంత ప్రేమ….?

వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైతన్నలకు నీటిని అందించడంలో ఎస్సారెస్పి కాలువలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. రెండో పంటకు గ్రామీణ ప్రాంతాలకు నీటిని అందించడంలో ఎస్సారెస్పీ కాలువల పాత్ర అత్యంత కీలకం. అలాంటి కాలువలను కాపాడుకోవడం ఎంతైనా అవసరం. కానీ కాలువలను కాపాడాల్సిన ఎస్సారెస్పీ అధికారులే అతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలువల తీరు ను పరిశీలించడానికి కనీసం కార్యాలయంనుంచి కాలు కుడా బయటపెట్టని అధికారులు కాలువలు బాగా లేనిచోట, కాలువల రహదారులను ఎవరైనా అక్రమంగా ఉపయోగిస్తున్న పిర్యాదు చేసిన పట్టించుకునే స్థితిలో ఎస్సారెస్పి అధికారులు ఎంతమాత్రం లేరు.

కదలరు....... మెదలరు- news10.app

మాధవ, సిరి స్టోన్ క్రషర్ లపై చర్యలేవి…?

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామ శివారులో నడుస్తున్న మాధవ, సిరి స్టోన్ క్రషర్లు గత కొద్ది సంవత్సరాలుగా ఎస్సారెస్పి కాలువ రహదారులను వాడుతున్నాయి. అసలు ఈ స్టోన్ క్రషర్ లకు రవాణాకు ఉపయోగించే రహదారి లేనేలేదు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సారెస్పీ కాలువల పక్కన ఉన్న రహదారులను ఉపయోగించడం చట్టరీత్య నేరం ఇది ఎస్సారెస్పి అధికారులకు తెలుసు క్రషర్ యజమానులు కాలువ రహదారిని వాడుతున్న విషయం తెలుసు … అన్ని తెలుసు కానీ చర్యలు తీ సుకోవడానికి మాత్రం మనసు రావడం లేదట. గత కొద్ది రోజుల క్రితం న్యూస్10 క్రషర్ల తీరుపై వరుస కథనాలు వెలువరించింది. దీనికి స్పందించిన అధికారులు చేస్తాం… చూస్తాం అని చెప్పారు తప్ప ఇప్పటికి ఆ క్రషర్లపై చర్యలు మాత్రం తీసుకోలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి తీరిక దొరకలేదట. అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్న వారు మాత్రం అలాంటివి ఎం పట్టించుకోవడం లేదు.

ఎందుకంత ప్రేమ…?

క్రషర్లకు చెందిన భారీ లోడ్ వాహనాలు ఎస్సారెస్పీ కాలువపై నుంచి వెళ్తున్న కాలువకు ముప్పు పొంచి ఉన్న ఎస్సారెస్పి అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్రషర్ యజమానులపై వీరు ఇంతలా ఎందుకు ప్రేమ చూపుతున్నారో అర్థం కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ యజమానులు వ్యవహరిస్తున్న వీరిపై చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారంటే వారితో అధికారులకు ఏమైనా లోపాయకారి ఒప్పందం కుదిరిందా… అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా తమకేం తెలియనట్లుగా వ్యవహిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

మంత్రుల సమీక్షలో ఒకే ….క్షేత్ర స్థాయిలో నో

ఇటీవల హన్మకొండలో ఎస్సారెస్పీ పై నలుగురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కాలువల నిర్వహణ, మరమ్మత్తులు తదితర అంశాలపై మంత్రులు స్పష్టమైన సూచనలు చేశారు. కాలువ రహదారులు ఇతరులు వాడకుండా చూడాలని చెప్పారు. అక్కడ ఓకే అని చెప్పిన అధికారులు మాత్రం క్షేత్ర స్థాయిలో మాత్రం నో చెపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మాధవ, సిరి క్రషర్ల విషయంలో అధికారులు ఇదే విధానాన్ని పాటిస్తున్నట్లు కనపడుతోంది. ఎవరు ఎన్నైనా చెపుతారు మన పని మనం చేద్దాం అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.

కూర్చొని మాట్లాడుతాం… ఎస్సారెస్పీ ఈ ఈ సాల్మన్ రాజ్

క్రషర్ యజమానులను స్వయంగా కలిసి కూర్చొని మాట్లాడుతామని ఎస్సారెస్పీ ఈ ఈ సాల్మన్ రాజ్ న్యూస్10 కు తెలిపారు. మాట్లాడక వినకుంటే నోటీస్ లు ఇచ్చి కేసులు పెట్టమని తనకు సూపరిండెంట్ సూచించారని ఆయన తెలిపారు.