తొమ్మిది వందలకే రేమిడి సివర్ అని ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ప్రధానమంత్రి భారతీయ జన ఔషది పరియోజన స్కీం ఆదికారులు స్పష్టం చేశారు…ఈ నెల 9 న న్యూస్10 వార్త పత్రికలో వచ్చిన వార్తను వారు ఖండించారు… జనరిక్ షాపుల్లో ఎక్కడ రేమిడిసివర్ అమ్మడం లేదని తెలిసింది… న్యూస్10 వార్త తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గందరగోళానికి గురి కావడం తో వారిని పత్రిక సవినయంగా క్షమాపణలు కోరుతోంది… కొవిడ్ సమయంలో ఇలాంటి వార్త ప్రజలకు ఊరట కలిగించిన ఆ వార్తలో నిజం లేకపోవడం భాద కలిగిస్తోంది.
900 లకే రేమిడి సివర్ వార్త విషయంలో బి పి పి ఐ అధికారుల వద్ద నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకోకుండా… దీని విషయంలో ఎలాంటి వివరణ లేకుండా ప్రచురించడాన్ని న్యూస్10 తప్పుగానే భావిస్తోంది. మరోవైపు 9వందలకే రేమిడిసివర్ వార్తను ప్రధానమంత్రి భారతీయ జన ఔషది పరియోజన స్కీం తెలంగాణ మార్కెటింగ్ అధికారి దేవేందర్ మందుల ఖండించారు… సోమవారం న్యూస్10 ప్రతినిధితో మాట్లాడిన ఆయన ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయకూడదన్నారు. జన సంబంధమైన వార్తలు కొవిడ్ సమయంలో రాసే ముందు బి పి పి ఐ వివరణ తీసుకుంటే బాగుండెదన్నారు.