హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై గత 45 రోజులుగా న్యూస్-10అక్షర సమరం చేస్తుంది ఎట్టకేలకు అధికారులు స్పందిస్తున్నారు తాజాగా హన్మకొండ పిఏసీఎస్ సీఈవో ను సస్పెండ్ చేసినట్లు హన్మకొండ జిల్లా సహకార అధికారి నాగేశ్వర్ రావు న్యూస్-10 కు తెలిపారు. పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ళు జరగకున్నా కోటికి పైగా కొట్టేశారు అనే వార్త ఆధారంగా జిల్లా అదనపు కలెక్టర్ ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని గత30 రోజుల క్రితం వేశారు… ఆ కమిటీలోని ముగ్గురు అధికారులు స్కాం జరిగిన తీరు ఎవరెవరు ఈ స్కాం లో పాల్గొన్నారు, గన్ని బ్యాగులు ఏమయ్యాయి ? కొనుగోళ్లే లేనప్పుడు ధాన్యం రవాణా ఖర్చులు ఎందుకు చెల్లించారు? అనే అంశాలపై లోతుగా విచారణ చేపట్టారు ఆ రిపోర్ట్ ను శుక్రవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి కి అందించనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల్లో సివిల్ సప్లై అధికారులపై అదనపు కలెక్టర్ చర్యలు తీసుకొనున్నట్లు తెలిసింది.కాగా సీఈవో సస్పెండ్ అయిన సమాచారం తెలుసుకున్న సివిల్ సప్లై ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారట