టీఆర్ఎస్ నేత నవీన్ రాజ్ కు సన్నిహితుల సూచన
ధర్మారంలో ఆయనకు అనుకూలంగా సమావేశం
సమావేశానికి హాజరయిన నవీన్ రాజ్
ఎవరెన్ని చెప్పిన పోటీలో ఉంటా… తప్పుకునే ప్రసక్తే లేదని అనుచరులకు స్పష్టీకరణ..
16 వ డివిజన్ నుంచి పోటీలో ఉండనున్న నవీన్ రాజ్
గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ లో నామినేషన్ల మొదటి రోజే రగడ ప్రారంభంమైంది… ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నేత గోపాల నవీన్ రాజ్ పోటీలో ఉండాలని ఆయన అనుచరులు, సన్నిహితులు కోరుతున్నారు… శుక్రవారం వీరంత కలిసి ధర్మారంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పోటీలో ఉండాలని కోరారు. ధర్మారం, జాన్ పాక, గరీబ్ నగర్, కీర్తి నగర్ కు చెందిన దాదాపు మూడు వందలమంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో నవీన్ రాజ్ కూడా పాల్గొనగా అందరూ 16 డివిజన్ నుంచి పోటీలో ఉండాలని కోరారు.. ఐయితే ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని ఏమాత్రం వ్యక్తపరచకుండా డివిజన్ లోని కొంతమంది ప్రజలు, అనుచరులు, సన్నిహితులు చెప్పిన మాటలే విన్న నవీన్ రాజ్ పోటీలో నిలిచేందుకు సై అన్నట్లు తెలిసింది… టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిన రాకున్నా పార్టీని విడేది లేదని… అలా అని పోటినుంచి తప్పుకునేది లేదని… స్వతంత్ర అభ్యర్థి గానైన పోటీలో ఉండి ఘన విజయం సాధిస్తానని నవీన్ రాజ్ తన అనుచరులకు స్పష్టం చేసినట్లు తెలిసింది… పోటినుంచి ఎట్టిపరిస్థితుల్లో తప్పుకునేది లేదని ఎవరు చెప్పిన వినని నవీన్ అన్నట్లు సమాచారం… మొత్తానికి 16 వడివిజన్ లో అప్పుడే టికెట్ గొడవ షూరువైయింది… ఇక్కడ సిట్టింగ్ కే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుండగా నవీన్ రాజ్ స్వరం పెంచుతుండడంతో ఇక్కడ గులాబీ కి ఇక్కట్లు తప్పేలా లేవని స్థానికులు అంటున్నారు.