కాసులు మిల్లరుకు… నష్టం రైతులకు…!

పంథినిలో కాలుష్యం వెదజల్లుతున్న లక్ష్మి బాలాజీ బాయిల్డ్ రైస్ మిల్లు
కష్టాన్ని నమ్ముకున్న రైతులకు చుక్కలు చూపిస్తున్న మిల్లు యాజమాన్యం
కాలుష్యంతో 150 ఎకరాల్లో పంట నష్టం అవుతున్న చలించని అధికారులు
మిల్లు వ్యర్థపు నీటిని చెరువులోకి వదులుతున్న యాజమాన్యం పెరుగుతున్న కాలుష్యం
ప్రభుత్వ బోరును వాడుతు నీతి వచనాలు… ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని బెదిరింపులు

ఎవరేమైతే నాకేంటి…? నేను లాభాల బాట పడుతున్నాన…లేదా?అన్నట్లు ఉంది ఓ మిల్లు యజమాని తీరు. తాను నడుపుతున్న మిల్లు కాలుష్యంతో స్థానిక ప్రజలు, రైతులు నానా కష్టాలు పడుతున్న తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. ఎవరైనా కాలుష్యంతో కష్టం అవుతుందని పిర్యాదు చేస్తే బెదిరింపులకు గురిచేస్తు ఇష్టమున్న చోట చెప్పుకోండని అంటున్నాడట. వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా పంథిని గ్రామంలో గతకొద్ది సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి శ్రీ బాలాజీ పార బాయిల్డ్ రైసుమిల్లు ను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఆ మిల్లు లాభల్లోనే నడుస్తుంది. ఇదంత బాగానే ఉన్నా రైస్ మిల్లు యజమానికి లాభాలు మాట ఎలా ఉన్నా మిల్లు కారణంగా రైతులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.కాసులు మిల్లరుకు... నష్టం రైతులకు...!- news10.app

ఎకరాల కొద్దీ పంటలకు నష్టం

శ్రీ లక్ష్మీ బాలాజీ పార బాయిల్డ్ రైస్ మిల్లు కారణంగా పంథిని పరిధిలోని మిల్లు చుట్టూ ఉన్న దాదాపు 150 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.మిల్లు నుంచి వచ్చే బూడిద, నల్లని దుమ్ము పంటపొలాలపై పడి పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. పత్తి పంట ఎంత కష్ట పడ్డ మిల్లు కాలుష్యం మూలంగా చేతికి రావడం లేదు దింతో రైతులు లబో.. దిబో మంటున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు పనికి రావాలన్న బయపసి పోతున్నారు. మిల్లు నుంచి వచ్చే దుర్గందాన్ని భరించలేక పని మధ్యలోనే మానేసి వెళ్తున్నట్లు రైతులు చెపుతున్నారు. రైతు కూలీలు వెల్లిపోవడం మూలంగా వ్యవసాయ పనులు కొనసాగక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మిల్లు యజమానిని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతూ తమపైనే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్నాడని రైతులు న్యూస్10 కు తెలిపారు.కాసులు మిల్లరుకు... నష్టం రైతులకు...!- news10.app

మురికి నీరు అంతా చెరువులోకి

శ్రీ లక్ష్మీ బాలాజీ బాయిల్డ్ రైస్ మిల్లు నుంచి వచ్చే వ్యర్టాల నీరు నిబందనల ప్రకారం మిల్లు పరిసర ప్రాంతంలో ట్యాన్కు నునేర్పాటు చేసుకొని అందులోకి నీటిని పంపాలి కానీ అందుకు విరుద్ధంగా ఈ నీటిని పంథిని, ఉప్పరపెళ్లి గ్రామాలకు ఆధారమైన ఎల్లమ్మచెరువులోకి నీటిని వదులుతున్నారు ఎలాంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇతరుల భూముల నుంచి ఈ మురుగు నీటిని వదలడం వల్ల భరించరాని దుర్వాసన కిలోమీటర్ల కొద్దీ వస్తోంది. మిల్లు నడిచేటప్పుడు కనీసం అక్కడ ఉండే పరిస్థితి కుడా ఉండడం లేదు. దుమ్ము, బూడిద, వునుక, నల్లని దుమ్ము వచ్చి మీదపడుతోంది పైగా వ్యర్టాల నీటిని వదలడం వల్ల నీరు కాలుష్యం అయిపోయి చెరువులో చేపలు మృత్యు వాత పడడమే కాకుండా, ఈ నీరు వల్ల పంట పొలాలు రోగాల బారిన పడుతున్నాయి.

ప్రజల కు వచ్చే నీరు మిల్లుకు

పంథిని గ్రామ ప్రజలకు నీటిని అందించేందుకు స్థానిక పంచాయతీ గ్రామ శివారులో బోరు వేసింది.వేసింది ప్రజల కోసమే ఐన నీళ్ళు మాత్రం రైస్ మిల్లుకు సరఫరా చేస్తున్నారు. దింతో మిల్లు కి బోర్ వాటర్ పంపించడంలో అంతర్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ కు బాలాజీ రైస్ మిల్లు పై ఎందుకంత ప్రేమ ఉందొ తెలియడం లేదంటున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు.సాధారణంగా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ప్రభుత్వాలు బోర్ లను ఏర్పాటు చేస్తాయి. కానీ దానికి విరుద్ధంగా పంథిని గ్రామంలో ప్రజల బోరు ను ఓ రైస్ మిల్లు యాజమాన్యం తన సొంతానికి వాడుకుంటుంటుంది. శ్రీ లక్ష్మి బాలాజీ పారబోయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యం ఆ గ్రామంలో ప్రజలకు వచ్చే నీళ్ళను అక్రమంగా తన మిల్లులోకి పైపుల ద్వార తరలిస్తున్న విషయం బహిరంగంగా జరుగుతున్నఅధికారులు ఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వ అధికారుల కు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి తెలిసి కూడా అందరూ చూసి చూడనట్లు వ్యవహరించడం ఆ గ్రామ ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.కాసులు మిల్లరుకు... నష్టం రైతులకు...!- news10.app

గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ మౌనం ఎందుకో….!

గ్రామానికి సంబంధించిన ప్రతి అంశం సర్పంచ్ కి, కార్యదర్శి కి తెలిసే జరుగుతుంది గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్న, ఊరికి ఎన్ని నిధులు వచ్చిన వీరిరువుకి తెలియకుండా ఏది జరగదు. అలాంటిది ప్రజలకు నీరు వచ్చే బోరు ను బాలాజీ రైస్ మిల్లు యాజమాన్యం పైపుల ద్వారా మిల్లు కు తరలిస్తున్న విషయం వీరికి తెలిసిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.మిల్లు యాజమాన్యం దొంగతనం గా నీళ్లు తీసుకెళ్తున్నార…? లేక సర్పంచ్, కార్యదర్శి లే వాళ్ళు ఇచ్చే ముడుపుల కు ఆశపడి విషయం తెలియనట్టు నటిస్తున్నార… అనేది ప్రజల ఆరోపణ.

గ్రామ కార్యదర్శి, రైస్ మిల్లు పై చర్యలు తీసుకోవాలి – ముంజ. ఆనందం

మా గ్రామంలో ప్రజలకు రావాల్సిన నీళ్ళను రైస్ మిల్లు యాజమాన్యం తన సొంతానికి వాడుకుంటుంది. గ్రామ పంచాయతీ నిధుల నుండి వేసిన బోరు ను ప్రజలు వాడుకోకుండా పైపులు పెట్టి మిల్లు వారు వాడుకోవడం, ఇది తెలిసిన పంచాయితీ కార్యదర్శి చూసి చూడనట్లు వ్యవహరించడం మాకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. మా పంథిని గ్రామ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి. అలాగే విపరీత మైన కాలుష్యానికి కారణం అవుతున్న మిల్లు యాజమానిపై సైతం చర్యలు తీసుకొని మిల్లును సీజ్ చేయాలి.కాసులు మిల్లరుకు... నష్టం రైతులకు...!- news10.app

బ్రతికే పరిస్థితి లేదు…ఎర్రబెల్లి వెంకటేశ్వర్ రావు, రైతు

మిల్లు కాలుష్యం మూలంగా తాము బతికేటట్లు లేదు. పలు మార్లు కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్ కు పిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. నాకున్న 8 ఎకరాలలో పంట వేస్తే ఎప్పుడు పంట చేతికి వచ్చింది లేదు. మెం ప్రశ్నిస్తే పోలీసులు మాపైనే కేసులు పెడతారు తప్ప మిల్లు యజమాని పై మాత్రం చర్యలు తీసుకోరు. రైతును బతికించేది పోయి కాలుష్యం తో మా ప్రాణాలు తీస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలి. మిల్లుపై చర్యలు తీసుకోవాలి.