ఎమ్మెల్యే చల్లా అనుచరుల వీరంగం

వారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు. అనుచరులు అంటే అలాంటి ఇలాంటి అనుచరులు కాదు..నిత్యం ఎమ్మెల్యే తో నీడలా ఉండే అనుచరులు.. అందులో ఒకరు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటి అతను…నియోజకవర్గం లో ఎవరు ఎమ్మెల్యే ను కలవాలన్న, ఎవరు ఎం మాట్లాడలన్న అతని అనుమతితోనే అంతాజరిగిపోతుందట.. అలాంటి వారు రోడ్డుపైకి వచ్చారు… వెళ్తుంటే వారి కారును ఎవరో చిన్నగా తాకించారట…ఇంకేముంది అసలే ఎమ్మెల్యే దగ్గరి అనుచరులు అధికారంలో ఉన్నవారు,హంగు ఆర్భాటం పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నవారు కనుక రోడ్డుపై వీరంగం సృష్టించారు… నడి రోడ్డుపై వాహనం ఆపి దేఖో మై పొలిటికలిజం అన్నట్లు రహదారిపై ట్రాఫిక్ జామ్ అవుతున్న ఇంచు కూడా కదలకుండా ఉండిపోయారు…అటుగా వెళ్తున్న వాహనదారులు తమకెందుకు వచ్చిన గొడవ అన్నట్లు… వేరే దారి వెతుక్కొని ఎవరి దారిన వారు వెళ్తున్నారు… ట్రాపిక్ జామ్ లో ఇరుక్కున్నవారు కార్ తీయకపోతారా…. అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు పుప్పాల రజినీకాంత్ తన కుటుంబంతో కార్ లో అటువైపు రాగా అడ్డుగాఉన్న ఎమ్మెల్యే అనుచరుల కార్ ను కాస్త పక్కకు జరపాలని కోరారు… అంతే ఎమ్మెల్యే అనుచరులు నలుగురు ఒక్కసారిగా పుప్పాలపై విరుచుకపడ్డారు… కార్ అడ్డు తీసేది లేదు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు దిగారు… వీరిలో ఒకరు రెడ్ క్రాస్ ఛైర్మెన్ గా, ఇంకొకరు రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా బాధ్యతయుతమైన పడవుల్లో కొనసాగుతున్న అదంతా మరచిపోయి ఇష్టారాజ్యాంగ వ్యవహరించారు. ఒక దశలో రెడ్ క్రాస్ ఛైర్మెన్, ఎమ్మెల్యే చల్లా ప్రధాన అనుచరుడు నిమ్మగడ్డ వెంకన్న పుప్పాల కార్ పైకి తన కార్ ను ఎక్కించమని తన డ్రైవర్ హుకుం జారీ చేస్తాడు.. దింతో పుప్పాల కుటుంబ సభ్యులు కొంత భయాందోళనకు గురవుతారు

ఎమ్మెల్యే చల్లా అనుచరుల వీరంగం- news10.app

మద్యం మత్తులో అనుచరులు…?

నడి రోడ్డుపై కారు నిలిపి వీరంగం సృష్టించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు పూర్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. రహదారిపై గొడవకు దిగిన వీడియో లను పరిశీలించిన వారు మద్యం సేవించినట్లు స్పష్టం అవుతోంది… తనపై దౌర్జన్యం చెయ్యడానికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు మద్యం సేవించి ఉన్నారని పుప్పాల రజినీకాంత్ సైతం న్యూస్10 కు తెలిపారు.

పోలీసులకు పిర్యాదు…

కార్ అడ్డుగా తొలగించమని అడిగినందుకు తనపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి దిగారని ప్రజాసేన అధ్యక్షుడు పుప్పాల రజినీకాంత్ మంగళవారం సుబేదారి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here