ఎంజీఎం కార్మికుల కన్నెర్ర…!

ఎంజీఎం కాంట్రాక్టర్ తీరుపై అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఆందోళన మొదలయింది… ఎంజీఎం టెండర్ దక్కించుకున్న తర్వాత సదరు కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరు… సిబ్బంది పట్ల ప్రవర్తిస్తున్న విధానం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు… ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఓ ఐక్యవేదిక గా ఏర్పడి కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం పై తమ నిరసన గళం వినిపిస్తున్నారు… కాంట్రాక్టర్ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వారు ఆవేదన చెందుతున్నారు …. ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎంజీఎం హాస్పిటల్ శాని టేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల ఐక్యవేదిక నా యకులు డిమాండ్ చేశారు. ఇటీవల వారు వరంగల్ జిల్లా కలెక్టరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సైతం అందజేశారు.

ఎంజీఎం కార్మికుల కన్నెర్ర...!- news10.app

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో జూలై 29 న కృష్ణ కన్స్ట్రక్షన్ అనే శానిటేషన్ ఏజెన్సీ టెండర్ దక్కించుకుందన్నారు. టెండర్ షెడ్యూల్ ప్రకారం టెండర్ అగ్రిమెంట్ అయిన వెంటనే 675 మందితో పనిచేయించాలి కానీ ఏజెన్సీ కి చెందిన కాంట్రాక్టర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు 370 మందితో మాత్రమే పనిచేయించి 675 మందికి బడ్జెట్ మంజూరు చేయించుకున్నారన్నారని వారు ఆరోపిస్తున్నారు. కృష్ణ కన్స్ట్రక్షన్ 370 మందికి మాత్రమే జీతాలు ఈఎస్ఐ పీఎఫ్ కట్టినారని, అందులో కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా కార్మికుల అకౌంట్లో జీతాలు వేశారన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారంగా 15,600 జీతంలో ఈఎస్ ఐ, పీఎఫ్, కటింగ్ పోను 12 వేల ఒక వంద రూపాయలు కార్మికుని అకౌంట్లో వేయాలి కానీ అందుకు విరుద్ధంగా 11000 రూపాయలు మాత్రమే వేస్తున్నారని అన్నారు. పీఎఫ్, ఈ ఎస్ ఐ కూడా 800 రూపాయల నుండి ఒక వెయ్యి పది రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు దీనిపై పలుమార్లు ఏజెన్సీ బాద్యులతో మాట్లాడాగా మేమింతే జీతం ఇస్తాం ఇష్టమైతే చేయండి లేదా వెళ్లిపోండి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంజీఎం అధికారులు సైతం వారిలో ముఖ్యంగా ఎంజీఎం హెల్త్ ఇన్స్పెక్టర్, పిఎంఎస్ హెల్త్ ఇన్స్పెక్టర్ , సూపరింటెండెంట్, ఆర్ఎంఓ ఎలాంటి మ్యాన్ పవర్ చూడకుండానే బిల్లులు ఇప్పిస్తున్నారని కాంట్రాక్టర్ తో అధికారులు మొత్తం కుమ్మక్కై కార్మికుల కడుపు కొడుతున్నారని వారు తీవ్ర స్థాయిలోఆరోపించారు. కాంట్రాక్టర్ సైతం కార్మికులతో జిల్లా మంత్రితో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయి… నన్ను ఎవరు ఏం చేయలేరని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఎంజి ఎంలో అధికారులు మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండి ప్రజల కార్మికుల యోగక్షేమాలు కాపాడే పరిస్థితిలో ఉండి కూడా ఒక కాంట్రాక్టర్ తో చేతులు కలిపి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. 675 మంది కార్మికులు చేయవలసిన పని 370 మంది కార్మికులతో చేయించారన్నారు.

అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై ఇటు కార్మికుల కడుపు మరియు ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్నారని దీనిపై కలెక్టర్ తక్షణమే స్పందించి ఎంజీఎం అధికారులపై చర్యలు తీసుకొవాలన్నారు. మరియు 11 సంవత్సరాలుగా ఎంజీఎం లో తిష్ట వేసిన హెల్త్ ఇన్స్పెక్టర్లను వారి డిప్యుటేషన్ రద్దు చేయాలని, కార్మికుల కడుపు కొడుతున్న శానిటేషన్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు… ఇదిలావుండగా ఎంజీఎం లో ఇంతజరుగుతున్న కాంట్రాక్టర్ విధానాల వల్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇప్పటివరకు ఎంజీఎం అధికారులు కాని…అండ ఉందని కాంట్రాక్టర్ చెప్పుకుంటున్న మంత్రి కానీ ఇప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు…ఎంజీఎం లో పాలన గాడి తప్పిన వారు తమకేం పట్టనట్లు వ్యవరిస్తూ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ బాగా ఉంటే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి…ఐయిన అటు అధికారులు ఇటు మంత్రి పెదవి విప్పడం లేదు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు…మరి ఈ విషయంలో కనీసం వరంగల్ కలెక్టర్ ఐయిన స్పందిస్తారో లేదో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here