రంగంలోకి ధ్యానం రవాణా కాంట్రాక్టర్…? ఆ అధికారిని కాపాడేందుకు పైరవీలు షురూ…

పలివేల్పుల ధాన్యం స్కామ్ వ్యవహారం రోజురోజుకో మలుపు తిరుగుతున్నట్లు కనపడుతుంది. ఇప్పటికే స్కామ్ బయటపడి విజిలెన్స్ అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో శాఖ పరమైన విచారణ కూడా కొనసాగింది.ఈ విచారణలో పలివేల్పుల లలో ధాన్యం కొనుగోలు పేరిట కోటిరూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లు వెలుగు చూసినట్లు సమాచారం. దింతో ఈ స్కామ్ లో ఉన్న హన్మకొండ జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, కొంతమంది ఉద్యోగులు ఇతర సిబ్బంది ఉన్నట్లు వీరిపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధం అయినట్లు తెలిసింది. ఈ మేరకు విచారణ నివేదిక కలెక్టర్ కు సైతం అందినట్లు అధికారులు తెలిపారు. ఐయితే ఈ విచారణ నివేదిక అధికారులనుంచి కలెక్టర్ కు అందగానే ఓ అధికారిని, కొంతమంది ఉద్యోగులను ఈ స్కామ్ నుంచి బయటపడేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాన్యం రవాణా కాంట్రాక్టర్ రంగం లోకి దిగినట్లు విశ్వసనీయ సమా చారం.

రంగంలోకి ధ్యానం రవాణా కాంట్రాక్టర్...? ఆ అధికారిని కాపాడేందుకు పైరవీలు షురూ...- news10.app

ఉన్నతాధికారులు తనకు అత్యంత సన్నిహితంగా ఉంటారని తాను చెపితే స్కామ్ చేసినట్లు పక్కాగా తేలిన కోట్లు మింగిన లైట్ గా తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోరని ఈ దాన్యం రవాణా కాంట్రాక్టర్ పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారికి ధైర్యం చెపుతూ తాను పైరవి మొదలుపెట్టినట్లు గొప్పలు చెపుతున్నాడట. అంతే కాకుండా ధాన్యం రవాణ ఓవైపు మరోవైపు మిల్లు ల నిర్వహణతో సివిల్ సప్లై అధికారులకు బాగా దగ్గరయి రెండు చేతులా బాగానే సంపాదించిన ఈ కాంట్రాక్టర్ విలువైన కార్లు కొనుగోలు చేసి ఉన్నతాధికారులకు వారికి ఏవైనా వ్యక్తిగత పనులు ఉంటే తన కార్లను పంపుతాడాని ప్రచారం జరుగుతోంది… ఈ సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఆ దాన్యం కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారిని తాను కాపాడుతానని అభయహస్తం ఇచ్చారట. కాగా ఈ ధాన్యం కాంట్రాక్టర్ కు సివిల్ సప్లై లో పనిచేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి దోస్తానా బాగానే ఉందట… వీరిద్దరూ కలిసి నగరానికి దగ్గర్లో ఉన్న ఓ మండల కేంద్రంలో మిల్లులు నిర్వహిస్తున్నట్లు తెలియ వచ్చింది. ఎలాగు ఈ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కనుక తనకు తన మిత్రుడు ధాన్యం రవాణా కాంట్రాక్టర్ కు లబ్ధ్ది జరిగేలా చూస్తాడని… పలివేల్పుల స్కామ్ లో రవాణా బిల్లుల మాయ ఈ ధాన్యం రవాణా కాంట్రాక్టర్ ఆధ్వర్యంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి డైరెక్షన్ లో పూర్తిచేసారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఇలా ఉంటే పలివేల్పుల స్కామ్ లో ఉన్న అధికారులపై కొద్దిరోజుల్లో వేటు పడనున్నట్లు తెలిసింది. విచారణ నివేదిక కలెక్టర్ కు అందిందని త్వరలోనే ఆయన సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here