నగరంలో ముదిరిన మెడికల్ వ్యాపారం

ఓ ఫార్మాసిస్టు ఉండడు ప్రిస్కిప్షన్‌ అవసరం ఉండదు మందుల అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగుతాయి ఏదైనా అడిగితే చాలు ఆ మందును డాక్టర్‌ (ప్రిస్క్రిప్షన్) చిట్టీ లేకుండానే చేతిలో పెట్టేస్తుంటారు కడుపు నొచ్చినా కాలు నొచ్చినా సరే మెడికల్‌ షాప్‌కు వెళ్తే చాలు మందులు ఇచ్చేస్తున్నారు నిద్ర రాకపోయినా గర్భం దాల్చవద్దన్నా ఇలా ట్యాబ్లెట్లు అడిగితే ఆ ట్యాబ్లెట్లను ఇట్టే ఇచ్చేస్తున్నారు ఆ మందులను ఎలా వేసుకోవాలో కూడా వారే సూచిస్తారు ఒకరికో ఇద్దరికో కాదు లక్షల రూపాయల్లో ఈ తరహా వ్యాపారం జరుగుతుందని సమాచారం ప్రతిరోజు గ్రేటర్‌ వరంగల్ పరిధిలో దాదాపు లక్షల పైన మందుల అమ్మకాలు జరుగుతుంటే అందులో సగం ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే జనం చేతిలోకి వెళ్లిపోతున్నాయి ఇదీ కొన్ని సార్లు బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని సార్లు రోగి ప్రాణాలకు ప్ర మాదంగా మారుతోంది ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఇలాంటి ఘటనలే అనేకం చోటు చేసుకుంటున్నాయి వారు తనిఖీ చేసిన ప్రతి మెడికల్‌ దుకాణంలో ఇలాంటివి కోకల్లుగా ఉంటున్నాయి.

నగరంలో ముదిరిన మెడికల్ వ్యాపారం- news10.app

నిబంధనలు పాటించని ఫార్మసీలెన్నో

నిజానికి ఏ మందులకైనా డాక్టర్‌ రాసి ఇచ్చిన చిట్టీని చూసిన తర్వాతే మందులను మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఏ మెడికల్ దుకాణ దారుడు కూడా నిబంధనలు పాటించడం లేదు రోగి కానీ, అతని కుటుంబ సభ్యులు వచ్చి ఫలాన మందులు కావాలంటే అలా ఇచ్చేస్తున్నారు. ఎందుకు, ఏమిటీ అనే ప్రశ్నలు ఇక్కడ అడగరు రోగికి రాసే మందుల్లో డోస్ ని బట్టి ఇవ్వవలసి ఉంటుంది రోగి వయస్సును, శరీరతత్వం, ఇతర వ్యాధుల ఆధారంగా చేసుకొని వైద్యులు డోసు లను నిర్ణయిస్తారు. రోగి ఏది చెబితే అది ఇస్తే సద రు రోగిపై మందుల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది అదే విధంగా ఆన్ వాంటెడ్ గర్భం దాల్చకుండా ఉండటం కోసం 72 గంటల పేరుతో వచ్చే మందులను కూడా నిర్వాహకులు ఎలాంటి ప్రిస్ర్కిప్షన్‌ (చిట్టి)లేకుండా విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది దీని వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని డాక్టర్లు చెబుతున్నారు అదే విధంగా కడుపు నొప్పికి పెయిన్‌ కిల్లర్‌ వంటి మందులను కూడా నిర్వాహకులు రోగులు అడిగిన వెంటనే ఇవ్వొద్దని సూచిస్తున్నప్పటికి మళ్లీ అదే తీరు నిర్వహిస్తున్నారు.

కోవిడ్ వైరస్ తో లక్షల్లో వ్యాపారం

వరంగల్ నగరంలో వందలకు పైగా మెడికల్‌ దుకాణాలు ఉన్నాయి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా వ్యాపారం కొనసాగుతున్నట్టు సమాచారం కరోనా కోవిడ్(19) మహమ్మారి భయం తో ప్రతిరోజు పెద్ద పెద్ద దుకాణాల్లో పది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతుండగా చిన్న దుకాణాల్లో రెండు వేలలోపు వ్యాపారం జరుగుతుంది ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా.

ఫార్మాసిస్టు లేకుండానే అమ్మకాలు

‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌-1940’ ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్టు ఉండాలి బీ.ఫార్మసీ, ఎమ్.ఫార్మసీ, డీ.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ మెడికల్‌ దుకాణాలను నిర్వహించాలి కానీ ఎక్కువగా మెడికల్‌ దుకాణాల్లో ఫార్మాసిస్టులు ఉండడం లేదు ఫార్మాసిస్టులు లేకుండానే ఇంగ్లీష్‌ అక్షరాలు చదవలిగిన వ్యక్తులు ఎవరు ఉంటే వారిని మెడికల్‌ దుకాణాల్లో పెట్టి అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం మెడికల్‌ దుకాణాలకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నది లేని ది పరిశీలించిన తర్వాతే వారికి అనుమతివ్వాల్సి ఉంటుంది అనుమతి తర్వాత కూడా ఏరియా ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్న సమయంలో ఫార్మా సిస్టులు ఉన్నారా లేరా అని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది లేదంటే నోటీసు జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అమ్మకాలు మాత్రమే జరపాలి

నిబంధనల ప్రకారం మెడికల్‌ దుకాణాలు కేవలం మందుల అమ్మకాలు మాత్రమే జరపాలని ఔషధ నియంత్రణ అధికారులు తెలుపుతున్నారు సాధారణ జ్వరం మాములు జలుబు దగ్గు వంటి వ్యాధులకు ఒక రోజు వరకు మందులు ఇస్తే సరే కానీ సదరు రోగి రెండో సారి వస్తే ప్రిస్ర్కిప్షన్‌ (చిట్టి) లేకుం డా ఇవ్వడానికి వీలు లేదని అధికారులు చెపుతున్నారు బీపీ, షుగర్‌, కార్డియాక్‌, న్యూరాలజీ, బ్రెయిన్‌ స్ర్టోక్‌, ప్రెగ్నెన్సీ, అబార్షన్‌ వంటి షెడ్యూల్‌కు సంబంధించిన వెయ్యి రకాల మందులను వైద్యుల సూచనలు, ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని అంతే కాకుండా ప్రిస్ర్కిప్షన్‌ పై డాక్టర్‌ ఎన్ని మందులు రాశాడో చూసి అంత వరకే ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నప్పటికి షాపు యాజమానులు ఇష్టానుసారంగా నడిపిస్తున్నట్టు సమాచారం అంతేకాకుండా ప్రిస్ర్కిప్షన్‌ పై మెడికల్‌ షాప్‌ స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది దీని వల్ల ఇతర చోట్ల కొనుగోలు చేయకుండా నిరోధించవచ్చు అంతే కాకుండా రోగి సెల్‌ నంబర్‌, చిరునామా కూడా బిల్లుపై పొందుపర్చాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.

ఇవీ నిబంధనలు

డ్రగ్స్ కాస్మొటిక్ నిబంధనల ప్రకారం మెడికల్‌ షాప్‌ నిర్వాహకులు పాటించాల్సి ఉంటుంది
డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్‌ మందులను అమ్మకాలు జరపొద్దు నాన్‌ షెడ్యూల్‌ మందులను కూడా రెండోసారి ఇవ్వొద్దని ప్రతి ప్రిస్క్రిప్షన్ లో సూచించిన మేరకే మందులివ్వాలని
డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌లో రాసిన మందులు కాకుండా ప్రత్యామ్నాయ మందులను ఇవ్వొద్దు.
ప్రిస్ర్కిప్షన్‌పై రెండో సారి మందులను విక్రయించొద్దు మందులిచ్చిన ప్రతిసారీ మెడికల్‌ షాప్‌ స్టాంప్‌ వేయాలి
విక్రయించిన మందులను సూచిస్తూ తప్పని సరిగా బిల్లు ఇవ్వాలి ఎప్పటికప్పుడు మందుల అమ్మకాల వివరాలను రిజిష్టర్‌లో పొందుపర్చాలి
దుకాణంలో మందులను వరుసగా పేర్చాలి ఎక్స్‌పైర్‌ అయిన మందులను విక్రయించొద్దు ఫ్రిజర్ లో మందుల సక్రమంగా నిల్వ ఉంచాలి
మెడికల్‌ దుకాణాల్లో మందులను కలిపే ప్రయత్నాలు చేయొద్దు
రోగికి వైద్య పరీక్షలు చేసి మందులను ఇచ్చే విధానం చేయొద్దు
మెడికల్‌ దుకాణాల్లో ఇంజెక్షన్లు ఇవ్వొద్దని తెలిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మెడికల్ దుకాణాల పై దాడులు నిర్వహించి గుర్తింపు రద్దు చేసే అవకాశము ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు

నిద్ర మత్తులో అధికారులు

జిల్లాలో మెడికల్ షాపుల్లో సాగుతున్న అవకతవకల పై నిఘా కొరవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిష్ట్రర్‌తో పాటు అన్నిరకాల నిబంధనలు పరిశీలించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉండటంతో మెడికల్ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుందని చెప్పొచ్చు ఇప్పటికైనా సంబంధిత డ్రగ్ అధికారులు జిల్లాలోని మెడికల్ షాపులపై నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.