తెలంగాణ రాక ముందు వారిద్దరూ… ఓ మాములు రిపోర్టర్లు, జర్నలిస్టు గా ఉద్యమంలో పాల్గొన్నదికూడా… ఎక్కడ భూతద్దం పెట్టి వెతికిన కనపడదు… అదృష్టం కొద్దీ తెలంగాణ రాగానే కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వస్తున్నాయి… ఉద్యమంలో గొంతుచించుకొని నినదించిన వారికంటే గోడమీద పిల్లి వాటం ప్రదర్శించిన వీరికె దండిగా లబ్ది చేకూరింది… లబ్దితో పాటు జర్నలిజంలో లబ్దప్రతిష్టులైన వారిని కూడా.. నువ్వెంత.. అంటూ కంటి చూపుతో బెదిరించే స్థాయికి ఎదిగి పోయారు… స్ట్రింగర్ల స్థాయి నుంచి జర్నలిజంలో తెలివితో ఎదగకున్న దొడ్డిదారిన ఎదిగిపోయారు. వీరిద్దరిని అందరూ గురు శిస్యులు అనిపిలుస్తారు. వరంగల్ నుంచి కేసీఆర్ దగ్గర పనిచేసే వరకు గురువు ఎడిగితే గురువు కనుసన్నల్లో శిష్యుడు మీడియా చిన్నోడిగా అవినీతి ఘనత కెక్కాడు… కేవలం 6 సంవత్సరాలలో కోట్ల రూపాయలకు పడగలెత్తి గురువు పరిస్థితి కాస్తా తారుమారు కాగానే… మొన్నటి వరకు పేరొందిన రాజకీయనాయకులను, పోలీసు అధికారులను అన్న, తమ్మి అని పిలిచి రాసుకు పూసుకు తిరిగిన మీడియా చిన్నోడు ఇప్పుడు నిఘా మూలంగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇదీ సంగతి…
తెలంగాణ రాక ముందు అప్పుడు చానల్ లో తన దగ్గర పనిచేసిన చిన్నోడిపై అనేక ఆస్తులు బినామిగా ఓ సీఎం పీఆర్ ఓ పెట్టినట్లు తెలుస్తోంది…. ఇప్పుడా మీడియా చిన్నోడు సిమ్ కార్డ్ లు అమ్ముకునే స్థాయి నుండి ఐటి పెయర్ గా మారినట్లు తెలిసింది. కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ రిటర్న్స్ సమర్పిస్తున్న ఈ మీడియా చిన్నోడు ఇదంతా బినామీ ఆస్తుల పెంపుకోసమే చేశాడని నిఘా పోలీసులు బావిస్తున్నట్లు సమాచారం…. ఈ పెద్దోడి బినామీ గతంలో ఉద్యోగం పోయి కొద్దీ రోజులు ఖాళీగానే ఉన్నాడు. జనగామాలో ఓ మీడియా ప్రతినిధి అత్యుత్సహం అప్పుడు ఉద్యోగానికి ఎసరు తెస్తే ఖాళీగా ఉన్న ఇతగాడు గురువు సీఎం దగ్గర చేరగానే అధికారపార్టీ ఛానల్ లో తన పలుకుబడి తో మళ్ళీ మీడియా ఉద్యోగం ఇప్పించాడు. కేవలం తన సొంత పనులు పైరవి ల కోసం శిష్యుడికి రూరల్ జిల్లాకు పోస్టింగ్ ఇప్పించాడని అప్పుడు మీడియా లోకం కోడై కూసింది.. అప్పుడు కాస్త స్వింగ్ లో ఉన్నారు కనుక ఎవరు అటుగా దృష్టి సారించలేదు.
ఇదే అక్రమాల చిట్టా…?
వివాదాస్పద భూములు టార్గెట్ చేసిన ఈ ఇద్దరు గురు శిష్యులు ఒకరు సీఎం పి ఆర్ ఓ గా మరొకరు మీడియా మేతావి గా… అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. శిష్యుడు పని మొదలుపెడితే గురువు హైదరాబాద్ సీఎం ఆఫీస్ నుండి ఫోన్ చేసి అధికారులను బెదిరించేవాడట. …సర్ ఉన్నాడు అన్ని చూసుకొంటాడు అవసరమైతే పెద్ద సర్ కె చెప్పితాడు అంటూ మీడియా చిన్నోడు బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చి గురువు సలహాతో మడికొండ లో 14 ఎకరాలకు కాగితాలు సృష్టించి చిన్నోడు గురువుకు బినామిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట. రూరల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట లో 10 ఎకరాలు.. నెక్కొండలో 15 ఎకరాలు, పరకాల లో 10, సంగెం లో 7, నర్సంపేట లో 2000 గజాలు, వరంగల్ 4 అపార్టుమెంట్లు , నగరంలో హోర్డింగ్స్ అన్నింటికీ బినామిగా మారి పోయి కోట్లకు పడగలెత్తిన మీడియా చిన్నోడు బయటకు పోజులు కొడుతూ ఉన్నాడట. గురువు సలహాతో ఈ మీడియా చిన్నోడి వద్దకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పోలీస్ లు సైతం తన ఇంటికి వచ్చి దావత్ చేసుకొంటారని పోజులు కొడుతూ తన స్థాయి మరచి మాటలు మాట్లాడుతూ మాటకు ముందు ,మాటకు వెనుక సర్ ఇప్పుడే ఫోన్ చేసిండు నేను ఉన్న అన్ని చూసుకుంటా. అంటూ బిల్డప్ లు కొట్టి హైదరాబాద్ లో గురువుపై వేటు పడగానే ఈ బిల్డప్ ల మీడియా చిన్నోడు అజ్ఞాత వాసంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది… తన బిల్డప్ లు, అతి తెలివి తో మీడియాలో స్ట్రింగర్ స్థాయి నుంచి జిల్లా ఇంచార్జ్ గా ఎదిగిన ఇతగాడు ప్రపంచ మేధావిగా పోజులు కొడుతూ తాను గురువుకు షాడో గా ఉంటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరికొంతమంది జర్నలిస్టులను తనకు షాడోలుగా మార్చుకున్నట్లు తెలుస్తుంది… జర్నలిజం లో ఓనమాలు సైతం తెలియని వారిని ప్రోత్సహిస్తూ వారిని తన అక్రమ పనులకు వాదుకున్నట్లు విశ్వసనీయ సమాచారం…వీరి డొంక కూడా కదిపేందుకు నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నారట…
(జర్నలిజం ముసుగులో ఇంకొందరి బిల్డప్ ఎంతకాలం….? సోమవారం సంచికలో…..)