భావన నిర్మాణం పూర్తి కాకముందే వ్యాపారాన్ని మొదలెట్టి ఆషాఢ ఆఫర్లతో కస్టమర్ల ను నిలువునా దోచుకుంటున్న నక్కలగుట్ట లోని మాంగళ్య షాపింగ్ మాల్ వ్యవహారం ‘ఆఫర్ అంటూ ఆగం’ శీర్షికన న్యూస్ 10 వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.దీనిపై జిల్లాలోని వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నా మాంగళ్య వ్యాపార సంస్థలో మాత్రం ఎలాంటి చలనం లేన్నట్లు తెలుస్తోంది .అరకొర సౌకర్యాలతో కస్టమర్ల వాహన పార్కింగ్ ,ఫైర్ సేఫ్టీ లేకుండా అమ్మకాలు మొదలుపెట్టినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేరు ఈ షాపింగ్ మాల్ కు వచ్చే కస్టమర్లు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేసి ప్రయాణికులకు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించినా ట్రాఫిక్ పోలీసులకు ఏమాత్రం పట్టింపే లేదని వాహనదారులు వాపోతున్నారు.వారు అలా ఉంటే భవన నిర్మాణం పూర్తి కాకున్నా ఏమైనా ప్రమాదం జరిగినా మాకు ఏమి పట్టవన్నట్లు సిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం…
న్యూస్ 10 దినపత్రికలో ప్రచురితమైన నక్కలగుట్ట లోని మాంగళ్య షాపింగ్ మాల్ నిర్లక్ష్యంపై “ఆఫర్ అంటూ ఆగం” కథనం పై సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాణోత్ వెంకన్న స్పందించారు.నిర్మాణం ఉన్న భవనంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం విరుద్ధమని అలాంటి వ్యాపార సంస్థలను ఉపేక్షించబోమని అన్నారు.విచారణకు అదేశించానని త్వరలో చర్యలు తీసుకుంటామని అన్నారు…