మహబూబబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ వ్యవహార వివాదంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చిక్కుకున్నారు….. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ భీం సాగర్ ను ఇటీవల డిప్యుటేషన్ పై హైద్రాబాద్ కు బదిలీ చేశారు… పదవీ విరమణకు కేవలం 16 నెలల సమయం ఉన్న తనను మంత్రి తన బంధువులకోసం అకారణంగా బదిలీ చేయించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు…… ఈ వివాదంతో అధికారుల బదిలీలు, ఇతర వ్యవహారాల్లో ప్రజాప్రతినిధుల జోక్యం ఎలా ఉంటుందో మరోసారి స్పష్టమైనట్లు ఉంది… దాదాపు ప్రభుత్వ శాఖలన్నింటిలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారుల వ్యవహారంలో ఎలా తలదూర్చుతారో ఇదో చక్కటి ఉదాహరణ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… కొందరు అధికారులు మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ జోక్యం కొంత అసంతృప్తి గానే ఉన్నట్లు తెలుస్తుంది…. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యవహారంలో మంత్రి పట్టుదలకు పోయి బదిలీ చేయించారని మంత్రి మేడమ్ మీకిది తగునా అంటూ ఆసుపత్రి ఉద్యోగులు తమలో తాము గుస గుస లాడుకుంటున్నారు… అసలే మంత్రి వ్యవహారం తామెక్కడ ఇదేంటని.. .ప్రశ్నిస్తే తమకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని లోలోపలే ఉద్యోగులు మదన పడిపోతున్నారట… సూపరింటెండెంట్ పదవి నుంచి తొలగించిన డాక్టర్ గా ఆసుపత్రిలో విధులు నిర్వహించి తన సేవలు అందిస్తానని మంత్రిని వేడు కున్న ససేమిరా…. అంటూ బదిలీ చేయడంపై ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందట.
సూపరిండెంట్ కన్నీళ్లు…
తెలంగాణలోని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ట్రాన్స్‌ఫర్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తనను తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ టార్గెట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆమె కుమారుడికి సంబంధించిన జీతం విషయంలో తాను రూల్స్ ఫాలో అయినందుకు తనను లక్ష్యంగా చేసుకుని కక్షగట్టి మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ బదిలీ చేశారని ఆరోపిస్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు ఆస్పత్రిలోనే విధులు నిర్వహిస్తారని, ఛెస్ట్ స్పెషలిస్ట్ అయిన మంత్రి కుమారుడు మాత్రం నెలలో వారం రోజులు మాత్రమే విధులకు వస్తారని చెప్పారు. కానీ, తాను మాత్రం రూల్స్‌కు కట్టుబడి ఆయనకు పూర్తి జీతం ఇవ్వనందుకు కక్ష గట్టి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు. మరో ఏడాదిన్నరలో తాను రిటైర్ అవుతున్నట్టు చెప్పిన భీంసింగ్ ఇప్పుడు ఉన్నట్టుండి ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో కనీసం ప్రమోషన్ మీద పంపినా తాను సంతోషపడేవాడినన్నారు. కేవలం డిప్యుటేషన్ మీద హైదరాబాద్ నగరానికి పంపించారన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ, మహబూబాబాద్‌లో ఇచ్చే జీతం తీసుకోవడం విచారకరమన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేసి మానసికంగా వేధిస్తున్నారని భీంసింగ్ ఆరోపించారు. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రి సత్యవతి రాథోడ్ పై ఆరోపణలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాలి. కాగా ఈ విషయమై మంత్రి వివరణ కోసం న్యూస్10 ప్రతినిధి ప్రయత్నం చేయగా మంత్రి అందుబాటులోకి రాలేదు.