ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలను రక్షించేందుకే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7వ తేది వరకు సీఎం చంద్రశేఖర్‌రావు పొడగించారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలోని పార్కులో సోమవారం కడియం ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య అధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సోమవారం హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో కరోనా తాండవాన్ని పసిగట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తీసుకున్న చర్యల వల్లనే పాజిటీవ్ కేసులు భారీగా పెరగలేదన్నారు. అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల ప్రతికల పేజీలు తగ్గడంతో కంట్రీబ్యూటర్లకు లైన్ అకౌంట్ తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కడియం పౌండేషన్ నిర్వాహకురాలు ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను అదుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించి కరోనాను తరమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
కడియం ఫౌండేషన్ నిర్వాహకురాలు కడియం కావ్వ మాట్లాడుతూ కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలను చేస్తున్నామని, అందులో భాగంగా కరోనా వల్ల జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు చూసి తనవంతుగా నిత్యావసర వస్తువులను అందజేశామన్నారు. భవిష్యత్తుల్లో ప్రజలకు, జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలను ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ నజీర్, కడియం రమ్య, శేషశయన్ జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్,కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్. బుచ్చిరెడ్డి, కొల్ల కృష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్ కుమార్, వలిశెట్టి సుధాకర్, తిరుమల్ సభ్యులు పాల్గొన్నారు.