కరోనాను ఎదుర్కొందాం – ఆర్థిక మంత్రి హరీశ్ రావు

కరోనా బాధితుల‌ సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు , ఆయన నివాసముంటున్న వసంత్ వ్యాలీ కాలనీ వాసి బి. గంగాధర్ రావు లక్ష‌రూపాయల చెక్ ను అందజేసారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాజిక బాధ్యతగా భావించి విరాళాలు ఇవ్వడం హర్షనీయమని మంత్రి హరీశ్ రావు గంగాధరరావు ను అభినందించారు.

కరోనాను ఎదుర్కొందాం - ఆర్థిక మంత్రి హరీశ్ రావు- news10.app

ఆర్థికంగా స్థిరపజిన వారు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు‌. ఇంట్లోనే ఉండి కరోనాను వ్యాప్తి చెందకుండా చేయడమే నేటి తరుణంలో నిజమైన సామాజిక బాధ్యత అని చెప్పారు. ఈ క్రతువులో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సామాజిక దూరం పాటించడం, ప్రభుత్వ సూచనలు తు.చ తప్పకుండా పాఠించడం ప్రతీ పౌరుని బాధ్యత అన్నారు. క్వారంటైన్ లో‌ఉన్న వారు ప్రభుత్వ, వైద్యల సూచనలు అనుసరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here