నేను మంత్రి మనిషిని స్వయానా ఓ మంత్రి తనకు బంధువు అవుతుంది.. న్యూస్10 కథనాలపై స్పందించకండి అంత నేను చూసుకుంట అని కాంట్రక్టర్లకు, కొందరు ఉద్యోగులకు అభయ హస్తం ఇచ్చిన ఆ డి సి ఓ ఇప్పుడు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్య తీసుకోండి అని కథనాలు రాసినందుకు న్యూస్10 పై పగ బట్టింది…తనకు రాజకీయ పలుకుబడి ఉందని న్యూస్10 ప్రతినిధులను ఏమైనా చేయగలనని తన ఉద్యోగులవద్ద అగ్గిమీద గుగ్గిలం అవుతున్న డి సి ఓ ఇప్పుడు వార్త కథనాలు రాసినందుకు ఏకంగా న్యూస్10 పైనే కలెక్టర్ కు పిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది…గురుకులాలకు సరైన ,నాణ్యమైన ప్రొవిజేన్స్ సరఫరా అవుతున్నాయని చెప్తు తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపిస్తు,మనం ఎదో రాచరిక పాలనలో ఉన్నట్లు గురుకులాలకు వచ్చి సరుకుల తీరు,నాణ్యత గురించి ప్రశ్నిస్తున్నారు
ఫోటోలు తీస్తున్నారని ఎవరు ఏమి ప్రశ్నించొద్దు తన ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు….కూరగాయలతో మొదలుకొని ప్రొవిజన్స్ వరకు నాసిరకం సరుకులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారని గత విద్యా సంవత్సరం నుంచి న్యూస్10 సంచలన కథనాలు వెలువరించింది… అప్పటి అధికారులు కొందరు చర్యలు తీసుకోగా కొందరు చూసి చూడనట్లు వ్యవహరించారు…ఈ విద్యా సంవత్సరం సైతం అదే పాత కాంట్రక్టర్లు టెండర్ దక్కించుకోగా కొన్ని ఏళ్లుగా అదే కాంట్రాక్టర్లు ఎందుకు పాతుకుపోయారని న్యూస్10 తన కథనంలో ప్రశ్నించింది…. టెండర్ల విషయంలో సామాజిక వర్గాల వారిగా నిబంధన పాటించాలని ఉన్న ప్రొవిజన్స్ టెండర్లు ఉన్నత వర్గాలకే ఎందుకు దక్కాయో సమాధానం లేదు…ఇదిలావుండగా ప్రొవిజన్స్ సరఫరా నాసిరకం పై ప్రశ్నిస్తే న్యూస్10 పై కక్ష గట్టి ఆ డిసిఓ ఇప్పుడు కలెక్టర్ కు పిర్యాదు చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది….
ఆ డి సి ఓ కే ఎందుకు….?
గురుకులాల్లో నాసిరకం సరుకులు సరఫరా అవుతున్నాయని,న్యూస్10 కథనాలు వెలువరిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆరుగురు డి సి ఓ లకు లేని పట్టింపు ఆ ఒక్క డి సి ఓ కే వచ్చినట్లుంది… “గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న” చందాన…న్యూస్10 తన కథనంలో ఎక్కడ ఆ డి సి ఓ పేరు ప్రస్తావించకున్న తనకు తానే ఎదో ఆపాదించుకొని నేను మంత్రి మనిషిని అది చేస్తా …ఇది చేస్తా అంటూ బెదిరింపులకు దిగుతూ పైగా తానే కలెక్టర్ కు పిర్యాదు చేస్తా అనడం ఏ మేరకు సబబో ఆ డి సి ఓ కే తెలియాలి….
బలవంతపు సంతకాలు….?
గురుకులాల్లో అన్ని బాగా నాణ్యత ఉన్న సరుకులే సరఫరా అవుతున్నాయి…తాము నాసిరకం సరుకులను తీసుకోవడం లేదు అలాంటి కాంట్రక్టర్లకు మెమో లు ఇస్తున్నాం…కావాలనే వార్త కథనాలు రాసి ప్రచారం చేస్తున్నారు… గురుకులాల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు అంటూ పెద్ద పెద్ద మాటలతో ఆ డి సి ఓ తన పరిధి దాటి ఓ పత్రాన్ని తయారు చేయించి ఎవరిపై తాము పిర్యాదు చేస్తున్నామో కూడా గురుకులాల ప్రిన్సిపాల్స్ కు తెలియకుండా తానే ఓ ఫార్మెట్ లో ప్రొఫార్మ తయారుచేసి అవసరం ఉన్న చోట ఖాళీలు ఉంచి ప్రిన్సిపాల్స్ కు పంపించినట్లు తెలిసింది…ఈ ఖాళీ పత్రం పై ప్రిన్సిపాల్స్ అందరూ సంతకాలు చేయాలని డి సి ఓ హుకుం జారిచేసినట్లు తెలిసింది.. కాగా కొందరు ప్రిన్సిపాల్స్ ఇందుకు నిరాకరించినట్లు సైతం తెలిసింది…గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నాసిరకం సరుకుల సరఫరా ను అడ్డుకోవాలని న్యూస్10 కథనాలు వెలువరిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన డి సి ఓ కథనాలు రాసిన న్యూస్10 పై కక్ష గట్టి కలెక్టర్ కు పిర్యాదు చేస్తా అంటూ బెదిరింపులకు దిగడం ఎందుకో వారికే తెలియాలి… ఈ తాటాకు చప్పుళ్లకు న్యూస్10 బెదరదు నాసిరకం సరుకుల దందా చేస్తున్న కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తూనే ఉంటుందనే విషయాన్ని డి సి ఓ గుర్తుంచుకోవాలి….ఎవరికి వంత పాడడానికి డి సి ఓ కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని బెదిరిస్తూ భావ ప్రకటన స్వేచ్చుకు అడ్డుపడుతున్నారో అర్థం అవుతుంది….