ఇన్నిరోజులు పార్టీ జెండా మోసి ప్రస్తుతం పార్టీ మారుతున్నాం అని నాయకులు ప్రకటించగానే ఆ మాటలు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారట. పార్టీ మారుతున్నామని తమ నాయకులు కొందరు చెప్తుంటే… మరి కొందరు పరోక్ష సిగ్నల్స్ ఇస్తుంటే… అధికార ప్రతిపక్ష కార్యకర్తలు ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అని సందిగ్ధంలో పడ్డారు…. గత కార్పొరేటర్ ఎన్నికల నుండి ఇప్పటి వరకు తమ నాయకులను నమ్ముకుని ప్రజలకు సేవలు చేస్తూ వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూసిన కార్యకర్తలం ఇప్పుడు మేము నమ్ముకున్న నాయకులు పార్టీ పిరాయిస్తే మా పరిస్థితి ఏంటని వారి మోహంలో ప్రశ్నార్థకం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇన్ని రోజుల నుండి అధికార,ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చేసుకున్న ప్రచారం బూడిదలో పోసిన పన్నీరేనా అని బాధపడుతున్నట్టు సమాచారం. మా నాయకులను నమ్ముకుని ఎన్నో కార్యక్రమాలు చేశామని ప్రస్తుతం పార్టీ మారుతున్నాం మీ ఉద్దేశ్యం ఏంటని ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయం తీసుకుంటే ఎల్లవేళలా ప్రజలతో కలిసిపోతూ వారికి సహాయం చేస్తూ ఈ సారి డివిజన్ కార్పొరేటర్ గా టికెట్ మాకొస్తుంది అంటే మాకని చెప్పుకున్నామని ఈ పరిస్థితుల్లో పార్టీ మారితే ప్రజలు మమ్మల్ని విశ్వసించరు అని కార్యకర్తలు వాపోతున్నారు. కొందరు నాయకుల పార్టీ ఫిరాయింపు విషయంలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూసిన కార్యకర్తలు కొందరు అయోమయం అవుతున్నారట. గతంలో సింహం గుర్తు పై పోటీ చేద్దామని అనుకున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలుపు మనదే అన్న ధీమాతో ఉన్న కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీలో చేరడం విమర్శలు వెల్లువెత్తాయి.
అధికార పార్టీ నుండి ప్రస్తుతం బిజెపి లోకి వెళతారని ప్రచారం కార్యకర్తల కు మింగుడు పడటం లేదు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలతో మమేకమవుతూ గుర్తింపు సంపాదించుకున్న వారికి ఇప్పుడు పరిస్థితి ఏంటని కొందరు కార్యకర్తలు తెగ భాధపడిపోతున్నారు. అటు దుబ్బాక ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి హవా వస్తుంది కావచ్చని ప్రస్తుతం వారు పార్టీ పిరాయించాలని నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. నాయకుడు పార్టీ మారితే మా పరిస్థితి ఏమిటని ఆలోచించే వారిలో కొందరు అధికార పార్టీ కార్యాకర్తలు పార్టీ మారితే డివిజన్ కార్పెరేటర్ గా టికెట్ వస్తుందో లేదో అనే ఆలోచనలో పడ్డారు.
ఒకవేళ అధికార పార్టీ వీడి నాయకుడి తో కలిసి పార్టీ పిరాయిస్తే అసలు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామా… లేదా…? అనే సందిగ్ధం లో పడ్డట్టు తెలుస్తుంది. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుల్లో ఇద్దరు బిజెపి లోకి వెళతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నమ్ముకున్న కార్యకర్తలమైన మా పరిస్తితి ఏంటని ఇప్పుడు కార్యకర్తలందరు ఆలోచన లో పడ్డారు. చూడాలి మరి కొందరు నాయకుడి పై ఇష్టంగా ఉంటే మరికొందరు పార్టీ పై అభిమానం తో ఉండగా ఎవరు మారతారు… ఎవరు పార్టీలోనే కొనసాగుతారో ఎన్నికలవరకు పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి.
ఏది ఏమైనప్పటికి పార్టీ మారలనే నిర్ణయం తీసుకున్నారట కొందరు ముఖ్య నాయకులు. రానున్న ఈ రెండు రోజుల్లో బీజేపీ లో చేరటంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఎంత మంది బుజ్జగించినా, ఎన్ని పావులు కదిపినా బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయం గానే కనపడుతోంది. మరో వైపు ఈ ఇద్దరు నాయకుల చేరికతో తూర్పులో బీజేపీ బలపడే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. ఇది ఇలావుంటే ఈ నాయకుల చేరికతో కార్యకర్తలు వారి వెనక నడుస్తారా …లేదా …? అనేది ప్రస్తుతం ప్రశ్నాఅర్ధకంగానే ఉన్న చివరకు పార్టీ మారాలని చూస్తూన్న ఈ నాయకుల వెంట ఏ కార్యకర్తలు ఎంతమేరకు పార్టీ మారుతారో వేచి చూడాలి.