కోట్లరూపాయలు విలువచేసే భూమిని కబ్జా చేసేందుకు స్కెచ్?..?
ఓ ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్న ఆయన అనుచరులు
16 ఎకరాల భూమిపై తిష్ట….కిరాయి మనుషులతో కాపలా
కాంప్రమైజ్ కావాలని అసలుదారులకు పిలుపు
ఎంతో కొంతకు సెటిల్ చేసుకోవాలని హుకుం
మంత్రితో మాట్లాడించారు సమస్య పరిష్కారం అవుతుందంటున్న బాధితులు
ప్రజాప్రతినిధులను ఢీకొనలేక పెద్దసారు చెప్పాడని భయపడి కోట్ల ఆస్తిని వదులుకుంటున్న వైనం…?
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో భూ ఆక్రమణలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. విలువగలిగిన భూములు ఏవి కనపడిన, భూమి యజమానులు కాసింత బలహీనులైతే చాలు ఆభూములు కొంతమంది ప్రజా ప్రతినిధుల పాలవుతున్నాయట. ఖాళీ భూమి కనపడిందంటే చాలు వీరు తమ అనుచరగణంతో వివరాలు సేకరిస్తారట భూమిపై ఎలా కాలు మోపాలో వ్యూహరచన చేసి కావాలంటే కొన్ని నకిలీ డ్యాకుమెంట్స్ సృష్టించి దర్జాగా అసలు దారుల లాగానే భూమిపై వాలి పోతారట. గత కొద్ది సంవత్సరాలక్రితం భూములపై వీరికి అంతగా కన్ను పడకపోయిన గత రెండు సంవత్సరాలనుంచి భూమికనపడితే చాలు ఇది మాదే అంటున్నారట. పరకాలకు చెందిన స్థానికులు కాకున్నా 24 గంటలు నియోజకవర్గ కేంద్రం లొనే గడుపుతూ తమ భూ ఆక్రమణల తెలివికి పదును పెడుతున్నారట.
మచ్చుకు ఓ ఘటన…
పరకాలలో కొంతమంది ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమ బూకబ్జాలకు ఇది ఓ తాజా ఉదాహరణ. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కడుపు కట్టుకొని కష్టపడి ఏకరాలకొద్ది భూమిని సంపాదించాడు. తనసంతానానికి సమానంగా భూమిని పంచాడు తన జీవనాదారంకోసం 16 ఎకరాల భూమిని అలాగే ఉంచుకున్నాడు. తన తదనంతరం తన సంతానానికి సమానంగా చెందేట్లు వీలునామా కూడా రాశాడాట. కొద్దీ సంవత్సరాల తర్వాత మరణించాడు. ఇప్పుడు ఆభూములు విలువైనవి కావడంతో కొందరి ప్రజాప్రతినిధుల కళ్ళు ఆ భూమిపై పడ్డాయట. ఇంకేముంది తమ కబ్జా తెలివిని మేల్కొలిపి భూమి అసలు దారుల్లో ఒక్కరిని దగ్గరచేసుకొని అతనికే భూమి అంతా రాసిఇచ్చినట్లు ఓ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూమిని వారి హస్తగతం చేసుకున్నారట. ఈ విషయం తెలిసి మిగతావారు లబోదిబోమని భూమి పైకి వెళ్తే బలవంతంగా అక్కడినుంచి వెల్లగొట్టారట అంతే కాదు ఓ ప్రజాప్రతినిధి ఇంటికి పిలిపించి ఇచ్చింది తీసుకొని పక్కకు జరగాలని హుకుం జారిచేసారట. ఎఓ కాగితాలు సిద్ధం చేసి సంతకాలు చేయమన్నారట దింతో అనుమానం కలిగి సదరు అసలుదారులు ఫోన్ మాట్లాడుతాం అని చెప్పి ఆ ప్రజా ప్రతినిది ఇంటి నుంచి బయట పడ్డారట. దింతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఏలోగోలాగా భూమిని స్వాధీనం చేసుకొని వెంచర్ వేసి కోట్లు కూడబెట్టాలన్న ఆలోచన ప్రజాప్రతినిధుల నుంచి పోలేదు దింతో భూమిని ఎలా హాస్తగతం చేసుకోవాలన్న ఆలోచనలకు వారు మరింత పదును పెట్టారట.
రంగంలోకి ఓ మంత్రి…?
స్థానిక పెద్ద ప్రజాప్రతినిదితో పని కాలేదు అతని హుకుంలు, ఆశ చూపడాలు ఎంతమాత్రం పని చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు చెప్పిన వినడం లేదు కనుక ఓ పేద్ద…. మనిషిని రంగంలోకి దించితే పని అవుతుందని భావించి ఆ పెద్ద మనిషితో మాట్లాడించి పనికానిచ్చారట. ఓ మంత్రి తమతో మాట్లాడారు తమ పని అయిపోయింది అని భాదితులు సైతం ఉబ్బితబ్బిబు అయిపోయిన కోట్ల రూపాయల ఆస్తికి బదులు వారికెమేస్తుందో… అందరికి తెలుసు. అసలు తమకు సంబంధం లేని భూమిపై వాలి, కిరాయి మనుషులను పెట్టి భూమిని తమ వశపరుచుకునేందుకు ప్రజాప్రతినిధులు ఏ అధికారంతో ప్రయత్నించారో అర్థం కాదు. మరోవైపు ప్రజా సేవ చేయడం ప్రజాప్రతినిధి గా కొనసాగడం అంటే ప్రజల భూములు అక్రమంగా ఆక్రమించుకోవడమేనా… అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.