ఓరుగల్లులో జనసేన….!

ఏడేళ్ల రాజకీయ ప్రయాణం అనంతరం జనసేన పార్టీ క్యాడర్ పెంచుకునే పనిలో పడింది. తెలంగాణ లో పార్టీ బలపడేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో సంస్థాగత కమిటీలు వేస్తూ జిల్లాలకు ఇన్ఛార్జ్ లను నియమించి పార్టీ నిర్మాణానికి బాటలు వేస్తుందా.. అంటే మారుతున్న సమీకరణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. చాపకింద నిరులా జనాల్లోకి జనసేన వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల రాష్ట్ర స్థాయి లో విద్యార్థి, యువజన విభాగ కమిటీలు వేశారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ ఇంచార్జి నియామకం చేసారు.

ఓరుగల్లులో జనసేన....!- news10.app

యువతతొ రాజకీయాలు చేయాలని యువత మీద దృష్టి పెట్టి ఆకర్శించుకునే ప్రయత్నం చేస్తుంది పార్టీ అధిష్టానం. ఈ దిశగా క్రియాశీల సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు 5 లక్షలు ప్రమాదభీమాతొ పాటు 50000 ఆసుపత్రి ఖర్చు ఇచ్చేందుకు, నూతన విధానం తీసుకొచ్చారు. సామాన్యుడు రాజకియంగా ఎదగాలని అధినేత, పవన్ యువతకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే వరంగల్ వేదికగా పార్టీ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ సిద్ధాంతాలతో మొదటి నుండి పార్టీ లో ఉన్నా యువతతో పాటు పార్టీ సానుభూతి పరులతో రహస్య సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

వరంగల్ లో విద్యావంతులతో జనసేన అధినేత భేటీ అయిన్నట్లు తెలుస్తుంది.గ్రేటర్ ఎన్నిక్లల్లో పోటీలో ఉండి పార్టీ ఉనికి చాటలని ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుండి సమాచారం. అన్నివిధాలా పార్టీకి వనరులు సైతం సమాకురుస్తున్నట్లు తెలుస్తుంది. సమాజసేవలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ సానుభూతి పరులకు అవకాశం కల్పించి పార్టీ బలం చూపించాలని నాయకత్వం వ్యూహం రచిస్తోంది. అందుకే అన్ని డివిజన్ సమస్యలపై ఆరాతిస్తున్నారు. డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలు వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గా ఆకుల సుమన్ ను అధినేత పవన్ నియమించారు.

ఈ యువనాయకుడు సారద్యం లో ఉమ్మడి వరంగల్ జిల్లా లో పార్టీ నిర్మాణం జరిగేందుకు సర్వం సిద్ధం అయింది. ఇదే ప్రాంతానికి చెందిన గాదె పృథ్వి అనే సామాన్య యువకుడికి రాష్ట్ర కార్యవర్గం లోకి అవకాశం కల్పించి వరంగల్ పట్ల అధినాయకత్వానికి ఉన్న అభిమానం చాటారు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతుంటే వరంగల్ రాజకీయాలు మారుతున్నాయి. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇక్కడి ప్రజలు జనసేన పట్ల సుముఖం కనపరుస్తారా లేదా అనేది చూడాలి. ప్రజ సమస్యల పట్ల పోరాడి జనంలోకి పార్టీని తీసుకెళ్లలని క్యాడర్ సిద్ధంగా ఉంది. చూడాలి జనసేన పార్టీ వరంగల్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి.