మావోయిస్టు హిద్మా రాక నిజమా…..?

బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చిన పేరు మాద్వి హిద్మా .. ఈ ఎన్ కౌంటర్ లో పదుల సంఖ్యలో పోలీసులు చనిపోవడానికి కారణం హిద్మా అని చెపుతారు… వ్యూహాలు పన్నడంలో, దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిద్మా ఇప్పటివరకు ఏ పెద్ద నగరాన్ని చూసింది లేదు అంటారు… తాను సేఫ్ జోన్ గా భావించే బస్తర్ లోనే అతడు ధైర్యంగా ఉంటాడని చెబుతారు… మావోయిస్టు పార్టీ మొదటిసారిగా ఏర్పాటు చేసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ గా ఉన్న హిద్మా ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ బాధ్యతల్లో ఐదు అంచెల భద్రత హిద్మా కు ఉంటుందని దాదాపు 180 నుంచి 250 మంది మావోయిస్టులున్న దళానికి అతను నాయకత్వం వహిస్తాడని సమాచారం. అంతేకాదు బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటన తర్వాత తెలంగాణ, చత్తీస్గడ్, ఒడిశా ప్రభుత్వాలు హిద్మా ను మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించి అతనిపై 50 లక్షల రివార్డు ను సైతం ప్రకటించాయి… మావోయిస్టు పార్టీ లో ఇంతటి పెద్ద బాధ్యతను నిర్వహిస్తూ, ఓ బెటాలియన్ కు చీఫ్ గా ఉన్న హిద్మా ఇంతటి నిర్బందంలో బస్టర్ ను వదిలి పోలీసు బలగాల డేగ కళ్ళ పహారా నుంచి బయటపడి తెలంగాణ కు చేరుకోవడం సాధ్యమా…. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అది తెలంగాణలో పూర్తిగా మావోయిస్టు పార్టీ బలహీన పడిందని పోలీసులు చెపుతున్న సందర్భంలో హిద్మా తెలంగాణలో ప్రవేశించడం అసాధ్యమని కొందరు అంటున్నారు.

మావోయిస్టు హిద్మా రాక నిజమా.....?- news10.app

కరోనా, అనారోగ్య సమస్యలు, పోలీసుల కూంబింగ్ లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టులు తెలంగాణకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హిద్మా ను పంపించే ప్రయత్నం చేయకపోవచ్చు… హిద్మా తెలంగాణలో ప్రవేశించాడనే ప్రచారం కేవలం ఊహాజనీతమే కావచ్చు… వ్యహాలు పన్నడంలో దిట్ట ఐయిన హిద్మా ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రవేశించాడంటే నమ్మశక్యంగా లేదనే వాదనలే బాగా వినిపిస్తున్నాయి. అంతటి భద్రత ను దాటుకుని రాష్ట్రాల సరిహద్దులు దాటి తెలంగాణలో ప్రవేశించే వరకు తెలంగాణ పోలీసులు గాని ఇంటెలిజెన్స్ గాని కూంబింగ్ బలగాలు కానీ పసిగట్టకపోవడం అసాధ్యం… ఏజెన్సీ ప్రాంతాల్లో ఎం జరుగుతుందో నిద్రాహారాలు మాని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న పోలిసులు హిద్మా రాకను అడ్డుకోగలరు… అవసరం అయితే పట్టుకోగలరు.. పోలీసుల ఇంతటి పకడ్బందీ కూంబింగ్ దాటుకుని ఓ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు తెలంగాణకు రావడం నిజంగా అసాధ్యం గానే కనిపిస్తుంది.

ఏజెన్సీ అలర్ట్….

పీపుల్స్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ -1 చీఫ్ హిద్మా ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ లోకి ప్రవేశించాడనే వార్తలతో పోలీసులు అప్రమత్తం ఐయ్యారు… ఏజెన్సీ ప్రాంతాల్లో గస్తీని పెంచి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు… కొత్తగా కనపడినవారిని, అనుమానితులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ అడవిలో అణువణువు జల్లెడ పడుతున్నారు. ఇది ఇలావుంటే హిద్మా ఏజెన్సీ లోకి ప్రవేశించాడనే వార్తలతో ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి… పోలీసుల విస్తృత తనిఖీలు, కూంబింగ్ తీవ్రతరం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here