ఆ డాక్టర్ అంతే….?

ఆ డాక్టర్ అంతే తనకు తోసింది చేస్తాడు…ఇది సరికాదు అని ఎవరు చెప్పిన ఏమాత్రం వినడట…
హన్మకొండ నగరంలో నడిబొడ్డున కాకాజీ కాలనిలో ఆర్థోపెడిక్ ఆసుపత్రి నడుపుతున్న ఆ డాక్టర్ సాబ్ కు సర్జరీల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కాస్త ఎక్కువేనని తెలిసింది.తనవద్దకు వచ్చే రోగులకు అర్హత ఉన్న డాక్టర్ గా సర్జరీలు చేయాల్సిన ఈ డాక్టర్ ఆ ఒక్కటి తనను అడుగద్దు అన్నట్లు ఎన్ని సర్జరీలు ఉన్న తనవద్ద పనిచేస్తున్న అర్హత లేని ఓ బి ఏ ఎం ఎస్ డాక్టర్ కు అప్పగించి తాను మాత్రం ఆసుపత్రిలో ఖాళీగా కూర్చుంటాడని తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ తతంగం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నట్లు అక్కడికి వైద్యం కోసం వెళ్లిన కొంతమంది చెపుతున్నారు.పెద్ద సారని అర్హత ఉన్న డాక్టరని ఆసుపత్రికి వెళితే అంత అర్హత లేని బి ఏ ఎం ఎస్ డాక్టర్ కు అప్పగించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.సర్జరీలు చేయడం సదరు డాక్టర్ కు అసలే గిట్టదని అందుకే ఓ బిఎ ఎం ఎస్ డాక్టర్ ను నియమించుకొని ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడని సమాచారం.

ఆ డాక్టర్ అంతే....?- news10.app

ఐ ఎం ఎ హెచ్చరించిన….?

ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో అర్హత లేని బిఎ ఎం ఎస్ డాక్టర్ తో సర్జరీలు చేయిస్తున్న విషయం గతంలోనే ఐ ఎం ఏ దృష్టికీ వెళ్లగా ఇది సరికాదని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించిన డాక్టర్ లో ఏమాత్రం మార్పు లేనట్లు తెలిసింది.అంతేకాదు ఆర్థోపెడిక్ అసోసియేషన్ సైతం అనర్హులతో సర్జరీలు చేయించడం మంచిదికాదని చెప్పిన డాక్టర్ సార్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసింది.

నకిలీ ఇంప్లాంట్స్….?

అర్హత లేని బి ఏ ఎం ఎస్ డాక్టర్ తో వైద్యం చేయించడమే కాకుండా గాయపడి కాళ్ళు ,చేతులు విరిగినవారికి అమర్చాల్సిన ఇంప్లాంట్స్ విషయంలో ఈ డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఐ ఎస్ ఐ మార్క్ ఉన్న మేలురకం ఇంప్లాంట్స్ అమర్చకుండా నకిలీ నాసిరకం ఇంప్లాంట్స్ అమర్చుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇంప్లాంట్స్ అమర్చడాన్ని వ్యాపారంగా మార్చారని బిల్లు మాత్రం భారీగానే తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇలా సర్జరీల్లో నకిలీ ఇంప్లాంట్స్ అమర్చడం వల్ల రోగులు ఇబ్బందులు పడి ఆసుపత్రికి వచ్చి నిలదీస్తే డబ్బులతో మ్యానేజ్ చేయడం ఈ డాక్టర్ కు అలవాటుగా మారిందని విమర్శలు వస్తున్నాయి.

పట్టింపులేని అధికారులు…

ప్రముఖ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో అనర్హుడితో సర్జరీలు చేయిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రిలో అర్హత లేకున్నా బి ఏ ఎం ఎస్ డాక్టర్ తో సర్జరీలు చేయిస్తున్నారని తెలిసిన ఆ ఆసుపత్రి పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.ఇకనైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రిపై దృష్టిసారిస్తార చూడాలి.

(సర్జరీకి రెండు వేలు… రోజు దాదాపు ఇరవైకి పైగా సర్జరీలు…ఇదీ బి ఏ ఎం ఎస్ డాక్టర్ రాబడి

ఈ ఆసుపత్రి ఒక్కటే కాదు…)

వివరాలు మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here