గులాబీ పార్టీ భారీఎత్తున ,కని విని ఎరుగని రీతిలో నిర్వహించాలనుకుంటున్న విజయ గర్జన సభకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి.. పది లక్షల మందితో ఘనంగా నిర్వహించాలకుంటున్న సభకు రోజు రోజుకు ఇబ్బందులు పెరిగి పోతున్నాయి.సభ కోసం నాలుగు వందల ఎకరాలు కావాలని వరంగల్,హన్మకొండ నగరాల్లో పలు ప్రదేశాలను పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు దేవన్నపేట గ్రామంలో ఉన్న భూములు సభకు సరిపోతాయని ,సభ అక్కడే నిర్వహించాలని అనుకుంటున్న ఇప్పుడు రైతుల రూపంలో అధికార పార్టీ నిర్వహించే విజయ గర్జనకు చుక్కెదురైయింది.గర్జనకోసం తమ స్థలాలను అసలే ఇవ్వమని ఇప్పుడు రైతులు గర్జిస్తున్నారు.సభ స్థలం కోసం ఎవరు వెళ్లిన ధర్నాలు,రాస్తారోకోలతో అడ్డుకుంటున్నారు.హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితం లో ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు కొంత డీలా పడిపోగా. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నా గులాబీ సైన్యానికి ఈటల రాజేందర్ బిగ్ షాకివ్వగా. ఆ ఓటమి నుంచి ఇంకా గులాబీ పార్టీ తేరుకోకముందే ప్రస్తుతం ఆ పార్టీ కి మరో తలనొప్పి మొదలైంది.
రైతులు ససేమిరా…
నవంబర్ 29న టిఆర్ఎస్ తలపెట్టిన సభకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. హనుమకొండ జిల్లా దేవన్నపేట్ లో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పంటలు పండే భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ సభకు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. శుక్రవారం సభస్థలి నిర్వహణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మీ రాజకీయాల కోసం మా పంటలను నష్టం చేసుకోవాలా?? అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మళ్ళీ రావద్దని ధర్నాకు దిగారు. రైతులు ఆందోళనతో అధికారులు తిరిగి వెళ్ళిపోయారు.దింతో ఇప్పుడు అక్కడ సభ నిర్వహణ విషయంలో అంత సందిగ్ధం నెలకొంది.ఓ వైపు సమయం దగ్గరపడుతుండగా రైతులు సభ కోసం తమ పంట పొలాలను ఇవ్వమని చెప్తుండగా ఏర్పాట్లు ఆలస్యం అవకాశం కనిపిస్తోంది…దింతో ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన కనిపిస్తుంది.రైతులను ఎలా బుజ్జగించాలో తెలియక వారు తలపట్టుకుంటున్నారు.
కోర్టుకు దేవన్నపేట రైతులు…?
టీఆర్ఎస్ విజయ గర్జన సభ కోసం తమ పంటపొలాలు ఇచ్చేది లేదని తెగేసి చెపుతున్న దేవన్నపేట రైతులు కోర్టు కు వెళ్లనునట్లు సమాచారం.సభకోసం ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకోకుండా చూడాలని వీరు కోర్టు ను అభ్యర్తించనున్నట్లు తెలిసింది.తమ భూముల్లో సభ నిర్వహించకుండా స్టే తేవడంకోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.