గీసుగొండ మండలంలో అక్రమవెంచర్లు పుట్ట గొడుగుళ్ల పుట్టుకొస్తున్నాయి

గీసుగొండ మండలంలో అక్రమవెంచర్లు పుట్ట గొడుగుళ్ల పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టుకొస్తున్న ఈ వెంచర్లు జనాన్ని మోసం చేస్తున్నాయని పలువురు అంటున్నారు. కేవలం రియల్ వ్యాపారం భారీగా వెనకేసుకోవాలనే ఆలోచన తప్ప అనుమతులు తీసుకోవాలన్న సోయి ఏ వెంచర్ యాజమాన్యానికి లేకుండా పోయింది. వెంచర్ వేసిన కొద్దీ రోజుల్లోనే ప్లాట్లలన్నీ అన్ని వేసి చేతులు దులుపుకుంటారు. కొనుగోలు చేసిన జనం మాత్రం అనుమతులు లేని వెంచర్ తో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొమ్మాలలో ఇలా….

గీసుగొండ మండలం కొమ్మాలలో 2ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ వేశారు.ఈ 2 ఎకరాల వెంచర్లో 42 ప్లాట్ల ను ఏర్పాటు చేశారు. ఇక వీరు పాటించే కుడా నిబంధనల గూర్చి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం రహదారులు వేసి మిగతా నిబంధనలన్నింటికి గండి కొట్టారు. కొమ్మాల పశువుల అంగడి పక్కనే ఉన్న ఈ వెంచర్ పై ఇప్పటివరకు అధికారుల దృష్టి ఎంతమాత్రం పడకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వరంగల్ ,నర్సంపేట ప్రధాన రహదారి ని ఆనుకొని కొద్దిగా లోపలికి వెళితే ఈ వెంచర్ కనపడుతుంది ఐయినా ఈ వెంచర్ పై అధికారులు ఇప్పటికి చర్యలకు ఉపక్రమించలేదు.

చర్యలు తీసుకోవాలి

కొమ్మాలలో అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసిద్ధి గాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న ఈ ప్రాంతంలో ప్లాట్లు కొనడానికి కొంతమంది ప్రజలు ఆసక్తికరంగానే ఉన్నారు. ఐయితే అక్రమ వెంచర్ వల్ల జనమే మోసపోయే అవకాశం ఉంది అందుకే అధికారులు తక్షణమే స్పందించి అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.