‘కుడా’ కనపడుతోందా…?

అక్రమ వెంచర్ దందా….!
నగరం లోని గోపాలపూర్ లో అక్రమ వెంచర్లు
కనీసనిబంధనలు పాటించని రియల్టర్లు
నాలా కన్వర్షన్ ఉండదు, కుడా అనుమతి లేదు
కొనుగోలు దారులను మోసం చేస్తూ ప్లాట్లు అమ్మకాలు
కేవలం 36 గుంటల్లో ఓ రియల్టర్ వెంచర్

'కుడా' కనపడుతోందా...?- news10.app కూడా అధికారుల నిర్లక్ష్యం పట్టింపులేని తనం గ్రేటర్ నగరంలో రియల్టర్లకు వరం గా మారింది.ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో కుడా అధికారులు ఉండడంతో అనుమతి లేని ప్లాట్లను కొని ప్రజలు పరేషాన్ అవుతున్నారు. నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వెంచర్లను నిర్వహిస్తూ అందినకాడికి దండుకొని కొనుగోలుదారులను నిండా ముంచుతున్నారు.

ఇదిగో వెంచర్ దందా…

రండి బాబు రండి ఇంత పెద్ద సిటీ లో మళ్లీ మళ్లీ అవకాశం దొరకదు. గజానికి కేవలం 9000మాత్రమే. ఇంకేముంది పాపం ఉండడానికి చోటు లేక, ఇంటి అద్దె కట్టలేక సొంత ఇంటి కలలు కంటున్న జనాలు ప్రచార మాయలో పడి తక్కువ రేటు అసలే గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్లాట్లు 20000 వేలు పెట్టినా దొరకని పరిస్థితి దింతో జనాలు క్యూ కట్టేస్తున్నారు. అసలు మరి ఈ వెంచర్ కు కుడా అనుమతులు ఉన్నాయా …లేవా..? అని ఆలోచించే సమయంకొనుగోలుదారులకు లేకపోవడం ఏదైతేనేం ప్లాట్ కావాలి అనుకోవడం ఇదే ఆ వెంచర్ యజమాని కి కలిసొచ్చే అంశం.

'కుడా' కనపడుతోందా...?- news10.app

36 గుంటల్లో వెంచర్..!

నగర శివారులో ఉన్న గోపాలపురం లో కేవలం 36 గుంటల్లో వెంచర్ వేసి రియల్టర్ నిబంధన జాన్తా నై అంటున్నాడు. ఈ వెంచర్ లో రోడ్లు ఉండవు అనుమతులు ఉండవు అధికారులు పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. నిజానికి నిబంధనల ప్రకారం వెంచర్ ఎన్ని గుంటల్లో చేయాలి, ఎన్ని ఫీట్లు రోడ్ ఉండాలి ,ఫ్లాట్ యజమానులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అని తెలిసినా కాసులకు కక్కుర్తి పడి నిబంధనలు తుంగలో తొక్కుతూ కూడా అధికారులు తననేం అనరనే ధీమాతో ఈ బడా రియల్టర్ అనుమతులు లేని వెంచర్ ను గోపాలపూర్ లో ప్రారంభించాడు. ఈ వెంచర్ ప్రారంభం ఐయి పనులు కొనసాగుతున్న, కొనుగోలు దారులు కొనడానికి ముందుకు వస్తున్న కుడా అధికారులు మాత్రం ఇప్పటివరకు ఆ వెంచర్ మొహాన చూసిన పాపాన పోలేదట.

నాలా కన్వర్షన్ పరిస్థితి ఏంది…

సాధారణంగా ఓ వ్యవసాయ భూమి ని కమర్షియల్ గా లేదా నివాస యోగ్యమైన ప్రాంతంగా మార్చాలంటే నాలా కన్వర్షన్ తప్పనిసరిగా చేయించాలి. అంటే నిబంధనల ప్రకారం సంబంధిత విఆర్వో భూమికి సంబంధించి పత్రాలు పరిశీలించి ఆర్ ఐ అనుమతి తో తహశీల్దార్ కు ఫైల్ పంపితే అక్కడి నుండి తహసీల్దార్ RDO కు పంపిస్తారు. సంబంధిత భూమి యజమాని ఈ కన్వర్షన్ కోసం చలాన కడితే RDO భూమిని పంచనామా చేసి కన్వర్షన్ చేస్తారు. ఇది నాలా కన్వర్షన్ పద్దతి. కానీ ఈ వెంచర్ విషయంలో అలాంటిది ఏమి జరగలేదని తెలిసింది. ఎలాంటి వెంచర్ కన్వర్షన్ లేకుండానే రియల్టర్ వెంచర్ వేసి ప్లాట్లు వేసి అమ్మడం ప్రారబించాడట. ఇందులో ఉన్న మర్మం ఏమిటో స్థానిక రెవెన్యూ అధికారులకే తెలియాలి.

'కుడా' కనపడుతోందా...?- news10.app

కుడా అనుమతి ఉందా?

ఇది ఇలా ఉంటే కుడా పరిధిలో ఎలాంటి వెంచర్ చేయాలన్న కుడా అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండా గోపాలపూర్ లో వెంచర్ చేసారని తెలిసింది. ఒక వేళ వెంచర్ యజమాని కూడా అనుమతి పొందాలంటే, కుడ నిబంధనలు పాటిస్తూ రోడ్లు వేయాలి, వెంచర్ లో పార్కు ఏర్పాటు చేయాలి ,ముఖ్యంగా నాలా కన్వర్షన్ కావాలి. మరి ఈ వెంచర్ లో రోడ్లు ఉండవు పార్క్ కు స్థలం కేటాయించరు అయినా వెంచర్ చేసారు.ఈ తప్పిదాలు అనుమతి లేకపోవడం కుడా అధికారులకు కనిపించట్లేదా.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.