మానుకోట లో అక్రమ భూ దందాలు..
మహబూబాద్ లో ఏదైనా సాధ్యం.. నీ చేతిలో డబ్బుండి, కొందరి అండదండలు ఉంటే ఈజీగా నీ పనులు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మానుకోట భూ దందాలు ఆగడాలు మితిమీరాయి. ఇందుకోసం దేనికైనా తెగిస్తున్నారు. అది రిజిస్టర్ భూమా, ప్రభుత్వ, లవానీ, అసైన్డ్ భూమా అన్నది చూడడం లేదు. అక్రమ భూ దందాలు చేసే కొందరు అప్పనంగా భూమిని కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయతిస్తున్నారు. ఇలాగే ఒక రౌడీ షీటర్ ఎప్పటినుంచో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తి ప్రభుత్వం జర్నలిస్టు కు కేటాయించిన భూమి పై కన్నేశాడు. తప్పుడు డ్యాక్యుమెంట్ లను సిద్ధం చేసుకొని రంగంలోకి దిగాడు. పదేళ్ల కిందట అమ్మినట్లుగా చూపి పాపం అడ్డంగా బుక్కయ్యాడు. భూ విషయంలో ప్రశ్నిస్తే దాడులు, ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతూ గుండాయిజాన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతటి తతంగం నడుపుతున్న ఒక రౌడికి ఎవరీ అండదండలు ఉన్నాయి? ఇతనికి ఉన్న బలo ఏమిటన్నది ఇప్పుడు మానుకోటలో చర్చించుకుంటున్న అంశం.
ఆ అధికారితో కనెక్షన్ ఏంటి?
అసలు ఎటువంటి అనుమతులు లేకున్న నిర్మాణ ప్రయత్నంపై ఆ అధికారికి ఉన్న సంబంధం ఏంటి? దీనిపై అతనికి ప్రత్యేక చొరవ ఎందుకు? అసలు ఎంత ముడుపులు ముట్టయి?. సామాన్యులు ఎవరైనా నిర్మాణo చేపడితే హల్చల్ చేసే మున్సిపాలిటీ అధికారులు ఈ వ్యహారంలో సైలెన్సుగా ఉండడం అసలు మతలబు ఎంటన్నది అంతుచిక్కని ప్రశ్న. మున్సిపాలిటీ కమిషనర్ తో రౌడీకి ఉన్న కనెక్షన్ ఏమిటని ? ఇటీవల జరిగిన పురపాలక సర్వసభ్య సమావేశంలో సదరు అధికారిపై వార్డ్ కౌన్సిలర్లు గరం అయ్యారు.
మానుకోట పట్టణo మున్సిపాలిటీ పరిధి కురవి రోడ్ లోని సర్వే నెంబర్ 2551/1 ప్రభుత్వ భూమిలో రౌడీ అక్రమ నిర్మణ ప్రయత్నంపై సంబంధిత అధికారికి కళ్ళు ముసుకున్నాయన్నది జగమేరిగిన నిజం. ప్రస్తుతానికి ఈ అంశంపై ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్నది.
మాములు వ్యక్తులు నిర్మాణo చేపడితే సవాలక్ష ప్రశ్నలతో అడ్డుతగిలి కూల్చివేస్తామని బెదిరించే మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది అగమగంగా అక్రమ నిర్మాణ ప్రయత్నం చేస్తున్న ఒక రౌడీ విషయంలో చూపిస్తున్న ప్రత్యేకత వెనుక అనేకానేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రౌడికి పరోక్ష సహకారం..
వాస్తవానికి ఆ అధికారికి అయితే అసలు తనకు అవసరం లేకున్నా, తన డ్యూటీ కాకున్నా కూడా తొందరగా రౌడీ ఇల్లు పూర్తి కావాలని పూజలు చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఎందుకంటె అతను చూపుతున్న చొరవను బట్టి తెలుస్తోంది. అసలు రౌడీ ఇంటి పర్మిషన్ సంగతి ఏంటని మాట్లాడితే దానదన్ ఛాంబర్ నుంచి సమాధానం చెప్పకుండానే మళ్ళొస్తా అని పరుగులు తీయడం విడ్డురం. ఇది వాస్తవం. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని సదరు రౌడికి పరోక్షంగా సహకరించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
అనుమతులపై మీటింగ్ లో సభ్యుల గరం..
మహబూబాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఇటీవల జరిగింది. అనేక సమస్యలతో అట్టుడుకిన సమావేశం కురవి రోడ్ లోని సర్వే నెంబర్ 2551/1 ప్రభుత్వ భూమిలో రౌడీ షీటర్ బత్తుల కృష అక్రమ నిర్మణ ప్రయత్నంపై సంబంధిత అధికారికి వ్యవరిస్తున్నా తీరుపై వార్డ్ కౌన్సిలర్లు మoడిపడ్డారు. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్, సీపీఎం లీడర్ సూర్ణపు సోమయ్య గళo విప్పారు. అసలు ఎలాంటి అనుమతులు లేకున్నా సదరు వ్యక్తి నిర్మాణ ప్రయత్నాలు ఎలా? చేస్తున్నాడని మున్సిపాలిటీ కమిషనర్ ను నిండు సభలో నిలదీశారు. అంతకాకుoడా సదరు వ్యక్తితో టూ వీలర్ పై తిరుగడాన్ని ప్రశ్నించారు. పరోక్షంగా అతనికి సహకరిస్తున్న చెప్పండి? అని వేరే వారెవరైనా నిర్మాణo ఇకపై ప్రశ్నించవద్దని అధికారిని కడిగి పారేశారు. సభలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటికప్పుడు కంటితుడుపు చర్య సదరు రౌడీ నిర్మాణ ప్రయత్నాల అపానని ప్రజాప్రతినిధులతో చెపుడుకొచ్చాడు.
రాత్రికి రాత్రికి పనులు.. అప్పటి నుంచి తన ప్రయత్నాలను అపాని రౌడీ
పట్టణంలోని ఒక మాములు గుండతో ఒప్పందం చేసుకున్న రౌడీ భూమి కబ్జాకు ప్రయత్నం మొదలు పెట్టాడు. పగలు సమస్య ఉంటుందని రాత్రికి రాత్రి పనులు చేయడం స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిoచాడు. ఒకదశలో పక్క ప్లాట్ వ్యక్తి దీన్ని వ్యతిరేకిoచి ఇక్కడ రౌడీకు పనేంటి అని పనులు చేయకుండా పరోక్షంగా అడ్డుకున్నడు. అబ్బా తన ఆటలు సాగవని రౌడీ తెల్లారే సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి ఆఫర్ ఇచ్చాడు. నిర్మాణ పనులపై మున్సిపాలిటీ అధికారిని కొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి వెళ్లి ప్రశిస్తే నన్ను అక్కడ పడుకొని కాపలా ఉండమంటారా? అని ఎదురు ప్రశ్నించాడు. రౌడీతో మాట్లాడుకోమని ఉచిత సలహా ఇవ్వడం అక్కడికి వచ్చిన విలేకరులు నివ్వెరపోయారు.
కూల్చివేతకు తహసీల్దార్ ఆదేశాలు..
ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నo చేస్తున్న విషయంలో ఇటీవల మహబూబాబాద్ తహసీల్దార్ రంజిత్ కు స్థానిక జర్నలిస్టులతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. నిజానికి మున్సిపాలిటీ అనునుమతి లేకున్నా నిర్మాణ ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై వెంటనే చర్యల నిమిత్తo సహకరించాలని కోరడం జరిగింది. 2010 సంవత్సరంలో స్థానికంగా ఒక పత్రికలో రిపోర్టగా పనిచేస్తుండగా అప్పటి అసైన్డ్ కమిటీ తీర్మానo మేరకు జర్నలిస్ట్ కోటలో తన భార్య పిల్లి రాజశ్రీ పేరిట 120 గజాల భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టాను అందజేయడం జరిగిందని లబ్ధిదారుడు పిల్లి రాజేందర్ తహసీల్దార్ కు వివరించడం జరిగింది. అనారోగ్యంతో తన భార్య చనిపోతే, అట్టి భూమిని తన భార్య అమ్మినట్లుగా తప్పుడు పత్రాలతో రౌడీ షీటర్ బత్తుల కృష్ణ భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపాడు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ను కూడా కలిసి విన్నవించడం జరిగిందని, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ర్ కూడా నమోదు కూడా తెలిపాడు. ప్రస్తుతానికి తన స్థలంపైకి వెళ్లగా దౌర్జన్యానికి పాపడుతున్నడని, రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాడని.
ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని, అలాగే అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణానికి యత్నం చేస్తున్న దానిపై చర్యల కోసం న్యాయం చేయాలని కోరాడు. దింతోనే మహబూబాబాద్ తహసీల్దార్ రంజిత్ తక్షణ చర్యల నిమిత్తం చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా మున్సిపాలిటీ కమిషనర్ ను కోరాడు. అనుమతి లేని నిర్మాణ ప్రయత్నాలను వెంటనే కూల్చివేయాలని లేఖలో పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆ అధికారి రౌడికి కొమ్ముకాస్తుండడం వెనుక ఉన్న కనెక్షన్ ఎంటన్నది అర్థం కావడం లేదు. మేము అనుమతులు ఇవ్వలేదు అంటూనే కూల్చివేత తమ పని కాదు అన్నట్లుగా వ్యహరిస్తున్నాడు. రౌడీ మోచేతి నీళ్లు ఎన్ని తగిన తన సిటు కిందకు నీళ్లొచ్చే రోజులు దగ్గరోలొనే ఉన్నాయన్న వాస్తవాన్ని సదరు అధికారి గుర్తించడం లేదు. నిజానికి భూమి ఎవరిదన్నది పక్కన పెడితే… అనుమతులు లేకుండా నిర్మాణ ప్రయత్నం చేస్తున్న అంశంలో కనీసం స్పందించకపోవడమే ఇక్కడ నెలకొన్న ప్రధాన సమస్య. అనుమతులు లేకుండా నిర్మాణ ప్రయత్నం చేస్తున్న ఆ అధికారి ఇంటి పర్మిషన్ ఎలా ఇస్తాడు అన్నది మాననుకోటలోని పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, నాయకులు, మేథావులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.