మొక్కలను రక్షించకుంటే ఉపేక్షించేది లేదు

అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరిక

హరిత హరం ఉపాధి హామీ పథకం. కోవిడ్ 19 పై సమీక్షించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్. ఈ సంవత్సరం హరిత హరం లో నాటిన మొక్కలు వంద కు వంద శాతం సర్వైవల్ లేని పక్షంలో ఉపేక్షించేది లేదని అధికారులను మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. బుధవారం హన్మకొండలో హరిత హరం, ఉపాధి హామీ పథకం, కోవిడ్ 19 పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంకీ కోర్టు ల ఏర్పాటు కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మొక్కలను రక్షించకుంటే ఉపేక్షించేది లేదు- news10.app

అవెన్యూ ప్లాంటేషన్ లో పెద్ద మొక్కలు మాత్రమే నాటాలని, ఇరిగేషన్ పనులకు ఉపాధి హామీ తో అనుసంధానం చేసిన నేపథ్యం లో నియోజక వర్గం లో సాగునీటి వనరులు పెంపొందించేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. కల్లాలు, రైతు వేదికలు, పశువుల కొట్టాలు (షెడ్లు)నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఉపాధి హామీ నిధులు వాడుకోవచ్చన్నారు. గత సంవత్సరం 1600 కోట్లు ఉపాధి హామీ ద్వారా ఖర్చు చేస్తే మూడు నెలల కాలం లో అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు అందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలన్నారు.

వెజ్ కంపొనెంట్ పెరిగితేనే మెటీరియల్ కంపొనేంట్ నిధులు ఎక్కువ మంజూరు అవుతాయని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే. గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఎంపి లు, ఎమ్మెల్యే లు, CP, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, చైర్మన్, మరియు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.