ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్ లోనే…
న్యూస్10 కు స్పష్టం చేసిన నాయిని రాజేందర్ రెడ్డి
పార్టీలో మనస్పర్థలు సహజం.. అలా. అని పార్టీని విడుతామ…?
మా సమస్యలు మేం పరిష్కరించుకుంటాం
మూడు సార్లు సర్దుబాట్లలో భాగంగా టిక్కెట్ దక్కకున్న సర్దుకు పోయా..
తాను కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుణ్ణి అన్న నాయిని
కొందరు తనపై కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
శనివారం న్యూస్10 పత్రికలో వచ్చిన కాంగ్రేస్ జంపింగ్స్ కథనం పై వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీని వదిలి వేరే పార్టీలో చేరాల్సిన అవసరం లేదన్నారు.
సమస్యలుంటే.. పరిష్కరించుకుంటాం
ఒక పార్టీలో కొనసాగుతున్నపుడు కొందరి వ్యక్తుల మధ్య అభిప్రాయ బేధాలు.మనస్పర్థలు సహజమని, అవి ఉంటే తాము పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటామని అంతమాత్రాన పార్టీని వదులుతామ… అని నాయిని ప్రశ్నించారు. జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడితో తనకు చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న మాట వాస్తవమేనని వాటిని సైతం పరిష్కకరించుకొని ముందుకు పోతామని, అంతే తప్ప తల్లి లాంటి కాంగ్రెసును విడేది లేదన్నారు.
టిక్కెట్ రాకున్నా …..
గత మూడు పర్యాయాలు పార్టీనుంచి టిక్కెట్ ఆశించి సర్దుబాట్లలో భాగంగా టిక్కెట్ కోల్పోయానని, అయిన ఎలాంటి నిరుత్సాహనికి గురికాకుండా పార్టీ అభివృద్ధికి తాను పాటు పడుతున్నానని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. టిక్కెట్ రాకున్నా పార్టీ కోసమే పని చేసిన తాను ఇప్పుడు పార్టీ వదులుతాననడంలో వాస్తవం లేదన్నారు.
కావాలనే ప్రచారం..
తాను పార్టీ మారుతున్నానని కొంతమంది కావాలనే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని నాయిని ఆరోపించారు. అధికార పార్టీ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ప్రజాలతరుపున గళం వినిపిస్తున్న తాను గులాబీ గూటికి పోవాలనుకోవడం ఏంటని.. ఇదంతా అర్ధరహితమన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ ని వదిలేది లేదని జీవితాంతం తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే కొనసాగుతుందని నాయిని రాజేందర్ రెడ్డి మరో మారు స్పష్టం చేశారు.