దేవుడి సాక్షిగా తాను ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న… భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గత కొద్దీ రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు… తనపై కొంతమంది కావాలని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు… రూపిరెడ్డి పల్లె సర్పంచ్ కవిత దేవేందర్ ఆరోపణలపై స్పందించిన ఆయన శుక్రవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.
రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత ఆమె భర్త దేవేందర్ మరియు మండలంలోని ఇతర గ్రామల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఈ నెల 4వ తారీఖున భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలవడం జరిగిందని, ఆ సమయంలో వారితో గంట పాటు ప్రజా సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అంతే తప్ప రూపిరెడ్డి పల్లి సర్పంచ్, ఆమె భర్త దేవేందర్ చెపుతున్నట్లు తాను ఎటువంటి అనుచిత వాఖ్యలు చేయలేదన్నారు.. తాను ఏమి అనకుండానే తనపై వారు చేస్తున్న అనుచిత వాక్యలను ఖండిస్తున్నానని గండ్ర అన్నారు.
ఇలాంటి వాఖ్యలు చేస్తే సహించేది లేదని, తన రాజకీయ ఎదుగుదలను, తనకున్న క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నానన్నారు. యూట్యూబ్ లో ఛానల్ నడుపుతున్న తీన్మార్ మల్లన్న ఒకరి అభిప్రాయం మాత్రమే స్వీకరించి…. కనీస జ్ఞానం లేకుండా తమ అభిప్రాయం తీసుకోకుండా తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ యూట్యూబ్ లో పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరడం హేయమైన చర్య అని గండ్ర అన్నారు.
తాను ఎవరిని ఏమి అనలేదని, తన నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా రాజకీయ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తన చుట్టూ ఉన్న వారు, తనను నమ్మి ఓటువేసి న ప్రతి ఒక్కరు అన్ని వర్గాలకు చెందిన వారని అన్నారు. తాను నమ్మే ఆ భగవంతుని సాక్షిగా ఎవరిని కించపరిచే వాక్యాలు చేయలేదు. కనుకనే ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని గండ్ర స్పష్టం చేశారు. తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని గండ్ర హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, PACS చైర్మన్, కౌన్సిలర్ లు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.