తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ భారీ రాజకీయ కుట్రకు తెరలేచిందా… అనామకులను అందలం ఎక్కిస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టి అత్యాశకు పోయి బోర్లా పడ్డార… ప్రభుత్వాన్ని కూల్చి తాము కీలకం కావాలని పథకం రచించార… పొరుగు రాష్ట్రంలో మంతనాలు జరిపి అడ్డంగా బుక్కై పోయార… ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ గా మారితే సూత్రధారులు, పాత్ర దారులు ఐయిన వారు మాత్రం ఎప్పుడు ఎంజారుగుతుందోనని తెగ గుబులు పడుతున్నారట… తాము నడిపిన మంత్రాగం, చేసిన కుట్ర తాలూకు విషయాలు ఆధారాలతో సహా బయట పడడంతో వారికి గత కొద్దిరోజులుగా కనీసం కంటిమీద కునుకు ఉండడంలేదట… తమను సంప్రదించేవారు… గతంలోలాగా మాట్లాడేవారు లేక ఒంటరిగా తెగ బాధపడుతున్నారట… ఒక్కో సారి అసలు ఎంజరుగుతుందో తెలుసుకోవడానికి వారే ఫోన్లు చేసి పరిచయస్తుల బుర్రలు తినేస్తున్నారట… కొద్దిరోజులక్రితం ఎవరు ఫోన్ చేసిన బిజీ అని చెప్పి ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు వారే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి మనసు కుదుట పర్చుకుంటున్నారట… ఇద్దరు తలపండిన సీనియర్ రాజకీయ నాయకులు… ముఖ్యమంత్రి కార్యాలయంలోని వ్యక్తి కలిసి ఈ త్రయం చేసినపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం తో ఉన్నారట… ఇటీవలే సి ఎం ఓ లోని వ్యక్తిని బయటకు పంపిన ఆ ఇద్దరు సీనియర్ నాయకుల నమ్మకద్రోహం పై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయట… అదృష్టం కొద్దీ ఈ భారీ కుట్ర త్వరగా బయటపడింది కానీ ఆలస్యం ఐయితే భారీగానే నష్టం జరిగేదని గులాబీ ముఖ్య శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు.
ఇదీ సంగతి….?
రాష్ట్రంలో గులాబీ పరిస్థితి అంతగా బాగా లేదు… గులాబీ వాడిపోవడం ఖాయం… మనం ఇందులోనే ఉంటూ బయటకు లీకులు ఇచ్చి భారీ ఎత్తున పాయిదా పొందుదాం… ఇది నిజం నిత్యం నేను సీఎం వెనకాలే ఉండే వాడిని నాకు ఇంటి గుట్టు మొత్తం తెలుసు… చీమ చిటుక్కు మన్న నాకు తెలుస్తుంది… లెక్క పత్రాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రవేశ పెట్టబోయే పథకాలు, ఎత్తుకు పైఎత్తులు వాటి కారణాలు ఒక్కటేంటి ప్రతి ఒక్కటీ నాకు తెలుసు నేను మీకు ఆధారాలతో ఉప్పందిస్తా… వాటితో మీరు రెచ్చిపోండి… ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించండి…. ఇది సీఎం దగ్గర కీలక వ్యక్తిగా ఎదిగి ఇటీవలే ఉద్వాసనకు గురైన ఓ వ్యక్తి ఓ జాతీయ పార్టీకి ఇచ్చిన భారీ ఆఫర్ గా విశ్వసనీయంగా తెలిసింది.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓ ఇద్దరు సీనియర్ లను తనవైపు తిప్పుకొని ఆ పార్టీకి మైలేజ్ ఇచ్చేందుకు బాగానే శ్రమించినట్లు తెలిసింది… ఇతగాడి మాటలకు, చేతలకు ఓ సీనియర్ నాయకుడు పార్టీలోకి వలస వచ్చిన నేత తోడయ్యి… నా రాజకీయ అనుభవంతో చక్రం తిప్పుతా నేను సీఎం… నువ్వు హోం అంటూ శాఖలు కూడా పంచేసి తెగ సంబురపడిపోయాడట… సీనియర్ రాజకీయ నాయుడిపై నమ్మకంతో సదరు సిఎంఓ ఉద్వాసన ఉద్యోగి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గాన్ని తాను పోటీచేసేందుకు ఎంచుకున్నాడట… ఈ ఇద్దరి మద్యే ఎం చేద్దాం… ఎలా చేద్దాం అని నిత్యం చర్చలు జరిగిన అప్పుడప్పుడు మరో సీనియర్ నాయకుడు వీరికి జతకలిసే వాడట… ఐయితే తెలంగాణలో ఈ త్రయం కలుసుకుంటే స్టేట్ ఇంటెలిజెన్స్ తదితర తల నొప్పులు ఉంటాయి కనుక రహస్యంగా ఉంటుందని పొరుగు రాష్ట్రం లోని బెంగళూరును ఎంచుకున్నారట… ఇక్కడే తరుచుగా ఈ ముగ్గురు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేవారట… దీనిని ఆసరాగా చేసుకొనే వీరిలో ఓ సీనియర్ నేత ఓ జాతియపార్టీలోకి వెళ్తున్నట్లు మీడియాకు లీకులు కూడా ఇచ్చుకున్నట్లు తెలిసింది. దింతో మీడియా ఆ రాజకీయనాయకుడు గులాబీని వదిలి ఆ జాతీయ పార్టీలోకి వెల్తున్నట్లు కథనాలు రాసింది.
ఇక్కడికి కథ బాగానే నడిపించిన సీఎం కేసీఆర్ డిల్లీ టూర్ తర్వాత ఈ త్రయం చేస్తున్న కుట్ర బట్టబయలు అయిందట… ఢిల్లీ పెద్దలు ఇంటి గుట్టు గూర్చి చర్చించడంతో షాక్ తిన్న గులాబీ బాస్ మొత్తం వివరాలు ఆరా తీయడంతో ఈ త్రయం ఘనకార్యాలు ఒకొక్కటిగా బయటికి వచ్చాయట… దింతో ఒక్కసారిగా ఖంగుతిన్న గులాబీ పెద్ద త్వరగానే తేరుకొని నష్టానివారణ చర్యలు ప్రారంభించి సదరు సిఎంఓ ఉద్యోగిని సాగనంపినట్లు తెలిసింది.. ఇక మిగిలిన ఆ ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులపై చర్యలకు సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది…. చర్యలు ఏవి తీసుకోనున్న వారి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించివేసి పక్కన పెట్టె అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి “ముందు మురిసినమ్మ పండుగెరగదు” అన్నట్లు ఎం కాకముందే శాఖలు పంచుకున్న వారు విషయం మొత్తం బయటకు రావడంతో ఎం చేయాలో పాలుపోక కొంతమేర మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శిస్తూ… ఎం జరగనట్లు… ఎం ఎరగనట్లు కలరింగ్ ఇస్తున్నారట.