ఇదిగో మరో అక్రమ కట్టడం

వరంగల్ త్రినగరిలో అక్రమకట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తవ్వినకొద్ది అక్రమకట్టడాలు బయటపడుతున్నాయి.ఏమవుతుందిలే… అని భావన యజమానులు లైట్ తీసుకుంటుంటే అక్రమ నిర్మాణాలు కనపడిన అధికారులు చూడనట్లు వ్యవహరిస్తుండడంతో రోజురోజుకు ఈ అక్రమకట్టడాల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది… అక్రమకట్టడాలపై న్యూస్10 గత వారంరోజులుగా వరుసకథనాలు ప్రచురిస్తుండగా.. అక్రమకట్టడాలపై కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయి.ఈ అక్రమ కట్టడాల సంఖ్య చాంతాడంత పెరిగిపోయింది.ముందు ఇష్టం ఉన్నట్లు కడదాం ఆ తర్వాత ఏమయినా ఉంటే చూద్దాం అనే ధోరణితో భవన యజమానులు ఉండగా వీరి ఆలోచనాధోరనికి తగ్గట్టుగా కొందరు అధికారులు సైతం సహకరిస్తుండడం విమర్శలకు దారితీస్తుంది…. అక్రమకట్టడాల వరుసలో మరో అక్రమకట్టడం ప్రధాన రహదారిని ఆనుకొని రాజసం ఒలకబోస్తుంది…అదాలత్ ప్రాంతంలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన ఈ అక్రమ కట్టడం టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాల్ విసిరినట్టు చుట్టు గ్రీన్ మ్యాట్ కట్టి చక చక నిర్మాణం కానిచ్చేస్తున్నారు.

ఇదిగో మరో అక్రమ కట్టడం- news10.app

సెట్ బ్యాక్ లేదు…

అదాలత్ ప్రాంతం ప్రదానరహదారిని ఆనుకుని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిర్మితం అవుతున్న ఈ బహుళ అంతస్తుల భవనానికి కనీస సెట్ బ్యాక్ లేదు.అంతర్గత రోడ్ లను సైతం వదలకుండా రోడ్డు పక్కకు ఏమాత్రం వెనక్కి జరగకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడిచారు.

టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించడం లేదా..?

హన్మకొండ నగరంలో అదాలత్ దగ్గరలోని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్న అధికారులకు ఎందుకు కనబడట్లేదో అని సామాన్యుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ అక్రమ నిర్మాణం అధికారులకు నిజంగానే కనబడడం లేదా…లేక చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేది టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలియాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here